»   » అశ్లీలం చేయాల్సివస్తే... సినిమాలు మానేస్తా: తేల్చి చెప్పిన హీరోయిన్!

అశ్లీలం చేయాల్సివస్తే... సినిమాలు మానేస్తా: తేల్చి చెప్పిన హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పటి సినిమాల్లోని హీరోయిన్లు చిట్టిపొట్టి డ్రెస్సులు, బికినీలు వేసుకుని ఎక్స్ ఫోజింగ్ చేయడం.... లిప్ లాక్ ముద్దు సీన్లలో నటించడం చాలా కామన్ అయిపోయింది. స్టార్ హీరోయిన్లు సైతం ఇందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు.

గతంలో కొందరు స్టార్ హీరోయిన్లు ఇలాంటి వాటికి దూరంగా ఉన్నప్పటికీ.... ప్రస్తుతం నడుస్తున్న ట్రెండును, పోటీని తట్టుకునేందుకు వారు కూడా ఇలాంటి చేయక తప్పడం లేదు. అయితే ఈ విషయంలో తాను అస్సలు రాజీపడబోనని, అవసరం అయితే సినిమాలు మానేసి ఇంట్లో కూర్చుంటానే తప్ప..... అశ్లీల సీన్లు అస్సలు చేయబోనని అంటోంది హీరోయిన్ మంజిమా మోహన్.

మంజిమా మోహన్

మంజిమా మోహన్

‘సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నాగచైతన్యతో జతకట్టిన కేరళ బ్యూటీ మంజిమా గురించి ఇటీవల మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. లిప్ లాక్ సీన్లకు సిద్ధంగా ఉందని, స్కిన్ షో చేయడానికి రెడీ అవుతోందంటూ గాసిప్స్ గుప్పుమన్నాయి. ఈ వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంజిమా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

తప్పుడు వార్తలు రాస్తున్నారు

తప్పుడు వార్తలు రాస్తున్నారు

తాను ఏదైనా మాట్లాడితే.... మీడియా వారు మరోరకంగా తప్పుడుగా వార్తలు రాస్తున్నారని మంజిమా మోహన్ ఫైర్ అయ్యారు. సినిమా ప్రేక్షకుల అభిరుచుల్లో తేడా వచ్చిందని, ప్రేక్షకులు గ్లామర్, అశ్లీలానికి మధ్య తేడాను గుర్తిస్తారని ఆమె తెలిపారు.

అలాంటి సీన్లు చేయను

అలాంటి సీన్లు చేయను

ఎక్స్‌ఫోజింగునే ఇష్టపడని తాను లిప్ లాక్ సీన్లను అస్సలు చేయనని ఆమె తేల్చి చెప్పారు. అలాంటి చేయడం వల్లనే అవకాశాలు వస్తాయంటే తాను ఇంట్లో కూర్చోవడానికి సిద్ధమే అని ఆమె తెలిపారు.

అశ్లీలానికి వీలైనంత దూరంగా

అశ్లీలానికి వీలైనంత దూరంగా

అవకాశాల కోసం అశ్లీల సీన్లు, పాత్రలు చేయడానికి తాను సిద్ధంగా లేను. ఇంట్లో అందరూ కూర్చుని చూసే విధంగా ఉండే సినిమాలను మాత్రమే చేస్తానని మంజిమా మోహన్ స్పష్టం చేశారు.

    English summary
    Manjima has already acted in several Malayalam films. But surprisingly, she never played a glamour doll. She has always been choosy and strictly against skin show.
    Please Wait while comments are loading...
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu