»   » ఏమిటి రామ్ గోపాల్ వర్మ ధైర్యం?? ముఖ్య మంత్రినే కోతి అన్నాడు... ఇప్పుడు ఏకంగా అతన్ని పోలిన పాత్రనే...

ఏమిటి రామ్ గోపాల్ వర్మ ధైర్యం?? ముఖ్య మంత్రినే కోతి అన్నాడు... ఇప్పుడు ఏకంగా అతన్ని పోలిన పాత్రనే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమితాబ్ తో అనేక సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ... కొన్నేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ బిగ్ బితో సర్కార్-3 అనే మూవీని ప్లాన్ చేసుకున్నాడు. తన తాజా చిత్రం 'సర్కార్-3'లో ప్రధాన పోషించే స్టార్స్ ఎవరో వాళ్ళ ఫోటోలతో సహా ట్వీట్ చేశారు. సుభాష్ నాగ్రే అనే పాత్రలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య భూమిక పోషిస్తాడని వర్మ తెలిపారు. ఇక జాకీ ష్రాఫ్, మనోజ్ బాజ్ పాయ్, రోనిత్ రాయ్, భరత్ ధబోల్కర్, అమిత్ సాద్, యామీ గౌతమ్, రోహిణి హట్టంగడి ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని ముంబై, విదేశాల్లో షూటింగ్ జరుగుతుందని వర్మ వెల్లడించారు.

Manoj Bajpayee’s character in Sarkar 3 inspired by Arvind Kejriwal..!?

ఇక ఈ సినిమాలో ఎవరెవరు ఏ క్యారెక్టర్స్ చేయబోతున్నారనే విషయాన్ని ముందుగానే రివీల్ చేశాడు రాము భాయ్. సినిమాలో నటించబోతున్న యామీ గౌతమ్, మనోజ్ బాజ్ పాయ్ ఎలాంటి పాత్ర పోషిస్తారనే దానిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన వర్మ... ఈ నయా మూవీలో సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ పోషించబోయే రోల్ ఏంటనే విషయాన్ని కూడా ముందుగానే వెల్లడించాడు. సర్కార్-3లో జాకీ ష్రాఫ్ మైకేల్ వాల్యా అనే రోల్ లో కనిపిస్తాడని...అండర్ వరల్డ్ సామ్రాజ్యంలో ఉండి ఆ తర్వాత లండన్ లో బిజినెస్ మ్యాన్ గా సెటిలైన క్యారెక్టర్ ఇది అని ముందుగానే హింట్ ఇచ్చాడు వర్మ.

తాజాగా మరో నిజ జీవిత పాత్రకూ ఇందులో చోటుందని తెలిసింది.సమకాలీన పాత్రల్ని సినిమాకి వాడుకోవడం వర్మకి కొత్త కాకపోయినా...నిజ జీవితంలో తీవ్ర విమర్శ చేసిన వ్యక్తి పాత్రని సినిమాలో చూపించడం ఇదే కావొచ్చు. సర్జికల్ స్ట్రైక్స్ మీద కేజ్రీ సందేహపడినప్పుడు వర్మ కౌంటర్ ఇచ్చాడు.ఆయన్ని ఏకంగా కోతితో పోల్చాడు.అదే లక్షణాలున్న క్యారెక్టర్ ఇప్పుడు సర్కార్ 3 లో వుంది.

Manoj Bajpayee’s character in Sarkar 3 inspired by Arvind Kejriwal..!?

మనోజ్ బాజ్పాయ్ పోషిస్తున్న ఈ పాత్ర పేరు గోవింద్ దేశ్ పాండే.ఆ పాత్ర వేషధారణ అచ్చు గుద్దినట్టు కేజ్రిని పోలి వుంది.దీంతో సర్కార్ త్రీ లో ఢిల్లీ సీఎం క్యారెక్టర్ ఎలా వుండబోతోదో అని అప్పుడే చర్చ మొదలైంది.ఏమైనా ఇలా ఫ్రీ పబ్లిసిటీ అడక్కుండా చేయించుకోవడం వర్మకి వెన్నతో పెట్టిన విద్య. ఇటీవలే ఇండియన్ ఆర్మీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్పై వర్మ విమర్శలు గుప్పించాడు. ఆయన ఒక కోతి అన్నాడు.ఈ నేపథ్యంలో గోవింద్ దేశ్ పాండే పాత్రను నెగెటివ్గానే చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Manoj Bajpayee plays Govind Deshpande in Sarkar 3, a character loosely based on a very cranky and sleightly violent version of Delhi CM Kejriwal
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu