»   » ఆ పోరాటం అక్క కోసమే... మంచు మనోజ్ అంత రిస్క్ తీసుకున్నాడా

ఆ పోరాటం అక్క కోసమే... మంచు మనోజ్ అంత రిస్క్ తీసుకున్నాడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు మ‌నోజ్ కి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ అంటే చాలా ఇష్ట‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. మంచు మనోజ్‌ అంటే ఒక యాక్టర్‌గానే కాదు, ఒక సింగర్‌గా, ఒక స్టంట్ మాస్టర్‌గా కూడా బాగా పాపులర్‌. అతడు నటించిన కొన్ని సినిమాలకు అతడే యాక్షన్‌ కొరియోగ్రఫీ కూడా చేశాడు. అయితే ఇప్పుడు మొదటిసారిగా తన అక్క మంచు లక్ష్మీ కోసం కూడా యాక్షన్‌ సీన్లను కంపోజ్‌ చేయడానికి రెడీ అయిపోయాడు.

మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన 'లక్ష్మీబాంబు' సినిమా కోసం మనోజ్ ఫైట్ సీక్వెన్స్ ను కంపోజ్ చేశాడట. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఈ యాక్షన్ సీన్స్ కు ఎంతో ఇంపార్టెన్స్ ఉందని, మనోజ్ మంచి యాక్షన్ ఎపిసోడ్ ను డిజైన్ చేశాడని చెపుతున్నారు చిత్రయూనిట్. త‌న సినిమాలు చాలా వాటికి యాక్ష‌న్ సీక్వెన్స్ అత‌నే డిజైన్ చేసుకున్నాడు కూడా. త‌న అన్న‌య్య మంచు విష్ణు కోసం కూడా ప‌ని చేసిన సంద‌ర్భాలున్నాయి. తాజాగా మ‌నోజ్.. తన అక్క ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌కు సైతం ఇందులో సాయం చేయ‌డం విశేషం.

Manoj Composes Fight For Lakshmi's Lakshmi Bomb

మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న కొత్త సినిమా 'ల‌క్ష్మీబాంబు'లో క్లైమాక్స్ ఫైట్ మంచు మ‌నోజే కంపోజ్ చేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని లక్ష్మీనే స్వ‌యంగా వెల్ల‌డించింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం 'ఒక్కడే మిగిలాడు' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు మంచు మనోజ్‌.అయినా తన సినిమా బిజీ ని పక్కన పెట్టి మరీ ఈ ఫైట్ కంపోజింగ్ లో పాల్గొన్నాడట.

ఈ చిత్రాన్ని దీపావ‌ళి కానుక‌గా రిలీజ్ చేస్తున్న‌ట్లు కూడా ల‌క్ష్మి తెలిపింది. ''ల‌క్ష్మీబాంబు సినిమాలో ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. సినిమా చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది. జ‌డ్జిగా ఇప్పటి వరకు చేయని డిఫరెంట్‌ క్యారెక్టర్ చేశాను. సింగిల్ షెడ్యూల్‌లో ఏక‌ధాటిగా సినిమా పూర్తి చేశాం. రెండు రోజులు మాత్ర‌మే షూటింగ్ మిగిలి ఉంది. ఫైట్లు, పాట‌లు బాగా వచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌ను తమ్ముడు మ‌నోజ్ ఆధ్వర్యంలో చేశాం. అది అద్భుతంగా వ‌చ్చింది. డైరెక్టర్‌ కార్తికేయ గోపాలకృష్ణ సినిమాను బాగా తెరకెక్కిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను దీపావళి కానుక‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం'' అని మంచు ల‌క్ష్మి తెలిపింది.

English summary
Lakshmi Prasanna’s new movie “Lakshmi Bomb” is being directed by Karthikeya Gopala Krishna and the shooting is almost completed for the film. Manchu Manoj composed the climax fight for the movie “Lakshmi Bomb”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu