»   » బాలీవుడ్‌ నటుడు మనోజ్‌కుమార్‌కు ఆపరేషన్

బాలీవుడ్‌ నటుడు మనోజ్‌కుమార్‌కు ఆపరేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Manoj Kumar
ముంబై : అలనాటి మేటి బాలీవుడ్‌ నటుడు మనోజ్‌కుమార్‌కు పిత్తాశయ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. తీవ్రమైన నొప్పితో మనోజ్‌కుమార్‌ ఇటీవల ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయన కులాసాగా ఉన్నారనీ వైద్యులు వెల్లడించారు.

ఇక ఆ మధ్య షారుఖ్‌ఖాన్‌పై ఆనాటి స్టార్ హీరో మనోజ్‌కుమార్ మరోసారి మండిపడ్డారు. రూ. 100 కోట్ల మేర పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. షారుఖ్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మించిన 2007 నాటి సూపర్ హిట్ ఫిల్మ్ 'ఓం శాంతి ఓం'లో తనని అనుకరిస్తూ షారుఖ్ చేసిన పేరడీ సన్నివేశాల్ని తొలగించకుండా జపాన్‌లో ఆ సినిమాని విడుదల చేసారని ఆయన సీరియస్ అయ్యారు.

ఆ సినిమాని అప్పట్లో శాటిలైట్ చానల్స్‌లో ప్రసారం చేయడానికి ముందుగానే తనకి సంబంధించి పేరడీ సన్నివేశాల్ని తొలగించాలంటూ ఆయన కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అవి పట్టించుకోకుండా ప్రసారం చేస్తున్నారు. జపాన్ లోనూ విడుదల చేసారు. ఇవన్నీ ఈ సీనియర్ హీరోని సీరియస్ అయ్యేలా చేసాయి.

మనోజ్ కుమార్ మాట్లాడుతూ... "ఆ సన్నివేశాల్ని తొలగించకుండా జపాన్‌లో 'ఓం శాంతి ఓం'ను రిలీజ్ చేశారు. ఇప్పటికే వాళ్లను రెండుసార్లు క్షమించాను. ఈసారి అలా చేయలేను. వాళ్లు నన్ను అగౌరవ పరిచారు. అన్ని ప్రింట్లు, ప్రసార కాపీల నుంచి ఆ సన్నివేశాల్ని తొలగించమని 2008లోనే కోర్టు తీర్పునిచ్చింది. అందువల్ల వారు కోర్టు ధిక్కార నేరాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. రూ. 100 కోట్ల పరువు నష్టం కోరుతూ షారుఖ్, ఈరోస్ ఇంటర్నేషనల్‌పై రేపు సివిల్, క్రిమినల్ కేసుల్ని వేయబోతున్నాను'' అని చెప్పారు .

English summary
Veteran actor Manoj Kumar underwent successful gall bladder surgery on Wednesday (July 24, 2013) morning, which also happened to be his birthday, at the Kokilaben Dhirubhai Ambani Hospital, a doctor said. "The surgery went for an hour and it went off well. He is back in the room," Ram Narain, executive director at the hospital, said. The actor complained of pain and was admitted to the hospital on July 17.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu