»   »  'హై ఫ్రొఫైల్ వెడ్డింగ్' గా మారిన మంచు మనోజ్ పెళ్లి

'హై ఫ్రొఫైల్ వెడ్డింగ్' గా మారిన మంచు మనోజ్ పెళ్లి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మంచు మనోజ్‌ ఈ రోజు (బుధవారం) ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రణతితో ఆయన వివాహం నేడు హైదరాబాద్‌లో జరగబోతోంది. బుధవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు పెళ్లి తంతు జరగబోతోంది. ఈ వివాహానికి...రాజకీయ,సినీ ప్రముఖులు చాలా మంది హాజరు అవుతూండటంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.

ముఖ్యంగా ఏడు రాష్ట్రాల గవర్నర్లు, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు, సౌత్ సిని ఇండస్ట్రీ స్టార్స్ ఈ పంక్షన్ కు హాజరవుతున్నారు. దాదాపు 700 మంది ప్రెవేట్ సెక్యూరిటీ పర్శన్స్, రెండు వేలకు పైగా గవర్నమెంట్ సెక్యూరిటీ పర్శన్స్ ...నిరంతరం ఈ వివాహాన్ని పర్యవేక్షిస్తున్నారు.

Manoj marriage becomes high profile wedding

ఇక ఈ పెళ్లి జరుగుతున్న ఈ రోజే మనోజ్‌ పుట్టినరోజు కూడా కావడం విశేషం. దీంతో మంచువారింట ఒకేరోజు రెండు వేడుకలన్నమాట. మంచు మనోజ్‌ బ్యాచులర్ లైఫ్ కు గుడ్‌ బై చెప్పే రోజు. తన జీవితంలోకి తోడుని ఆహ్వానించే రోజు. తన పుట్టినరోజు. ఇవన్నీ ఒకే రోజైతే ఇక అంతకంటే మంచి రోజు మరొకటి ఉంటుందా? అందుకే ఇది చాలా విశేషమైన రోజు. గత వారం రోజులుగా మంచు వారింట పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి. మెహందీ, సంగీత్‌ వేడుకలకి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి సందడి పూర్తవ్వగానే దశరథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారు మనోజ్‌.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్ సెర్మీ పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీతారలు హాజరై సందడి చేసారు. డాన్స్ చేసి అదరగొట్టారు. గత పది రోజుల నుండి పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసినా మంచు మనోజ్ పెళ్లి వేడుక గురించే చర్చించుకుంటున్నారు. అంతగ్రాండ్ గా వేడుక నిర్వహిస్తున్నారు.

ఇటీవల మనోజ్ కు నలుగు పెట్టే కార్యక్రమం, పెళ్లి కొడుకును చేసే వేడుక సందడిగా సాగింది. తెలుగు ఇండస్ట్రీ బిగ్ షాట్స్ చిరంజీవి, బాలకృష్ణ తదితరులు హాజరై మనోజ్ ను ఆశీర్వదించారు . హైటెక్స్ వివాహ వేడుక గ్రాండ్ గా జరుగబోతోంది. ఈ పెళ్లి వేడుకకు దాదాపు 10వేల మందికి పైగా అథితులు హాజరవుతారని సమాచారం. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

బిట్స్‌ పిలానీలో చదువుకుంటున్న ప్రణీత మంచువారి కుటుంబానికి సుపరిచితురాలే . గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగి ...పెద్దల అంగీకారంతో ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. మంచు విష్టు భార్య వెరొనికాకి ప్రణీత క్లోజ్‌ ఫ్రెండ్‌ అని తెలుస్తోంది. ఈ విధంగానే ఆమె ఈ యంగ్‌హీరోకి పరిచయమై, క్లోజ్‌ అయినట్లు సమాచారం.

English summary
Stage is set for Mohan Babu's son Manchu Manoj's wedding withh Pranathi Reddy today on May,20th at 9.05 am at Hi-Tex, Hyderabad. Star celebrities from film and political arena will be attendiing the marriage.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu