»   » ఐదు భాషల్లో ‘ఊకొడతారా...ఉలిక్కిపడతారా’

ఐదు భాషల్లో ‘ఊకొడతారా...ఉలిక్కిపడతారా’

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు మనోజ్ మొదట నేను మీకు తెలుసా, ప్రయాణం వంటి ఎక్స్ పరమెంట్ చిత్రాలలో నటించి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి తర్వాత వీరుపోట్ల దర్శకత్వంలో 'బిందాస్" తో ఊపందుకొన్న తర్వాత అతని కాన్ఫిడెన్స్ లెవల్ పెంచుకొంటూ తగు జాగ్రత్తగా చిత్రాలను ఎంచుకొంటూ ముందుకు సాగుతున్నాడు. త్వరలో విడుదల కాబోతున్న'వేదం" మల్టీస్టార్స్ చిత్రం అల్లు అర్జున్ తో కలిసి మనోజ్ నటించిన విషయం తెలిసిందే.

కెరీర్ మొత్తం మీద ఐదు భాషల్లో నటించిన నటీనటులు చాలా మందే ఉంటారు. కానీ ఒకే చిత్రం ఒకేసారి ఐదు భాషల్లో తెరకెక్కితే..అందులో నటించే హీరో మనోజ్ అవుతాడు. కృష్ణవంశీ శిష్యుడు రాజా దర్శకత్వంలో మనోజ్ 'ఊకొడతారా..ఉలిక్కిపడతారా" అన్న చిత్రంలో నటించనున్నాడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మనోజ్ నటిస్తున్న 'ఝుమ్మంది నాదం" సినిమా తర్వాత ఈ తాజా చిత్రం 'ఊకొడతారా...ఉలిక్కిపడతారా" తెరకెక్కనుంది ఇంతకీ ఐదు భాషలంటే దక్షిణాది భాషలు(తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం)తో పాటు హిందీలో కూడా ఈ చిత్రం తెరకెక్కనుంది కాబోలు. వెరైటీ చిత్రాలు..కొత్తదనం కోరుకునే మనోజ్ మరో ప్రయోగం చేస్తున్నాడన్నమాట! ఆల్ ది బెస్ట్ టు మనోజ్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu