»   » మంచు మనోజ్ టీజర్ ఎందుకు రిలీజ్ చేయలేదు..? అమ్మ మరణం వల్లనే అని....

మంచు మనోజ్ టీజర్ ఎందుకు రిలీజ్ చేయలేదు..? అమ్మ మరణం వల్లనే అని....

Posted By:
Subscribe to Filmibeat Telugu

డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్, కొద్దికాలంగా హిట్ కోసం ఎంతగానో తపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనకు మంచి గుర్తింపు తెచ్చిన డిఫరెంట్ కమర్షియల్ సినిమానే నమ్ముకొని 'ఒక్కడు మిగిలాడు', 'గుంటూరోడు' అన్న రెండు సినిమాలను సిద్ధం చేస్తున్నారు. మంచు మనోజ్ కథానాయకుడిగా 'గుంటూరోడు' సినిమా రూపొందింది. సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఆ తరువాత పనులను వేగంగా జరుపుకుంటోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మనోజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా.. సంపత్, కోట శ్రీనివాస రావు, రావు రమేష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి మోషన్ పోస్టర్ విడుదల చేయగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.


Manoj’s Gunturodu Teaser Release Postponed

ఈ సినిమా నుంచి ఈ నెల 7వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయాలనుకున్నారు. గుంటూరులో ఒక వేడుక ద్వారా ఈ టీజర్ ను వదలాలని నిర్ణయించుకున్నారు. అయితే దేశం జయలలిత వంటి గొప్ప నాయకురాలిని కోల్పోవడం వలన, టీజర్ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు మనోజ్ చెప్పాడు. టీజర్ రిలీజ్ కి కొత్త డేట్ ఎప్పుడనేది త్వరలో చెబుతామని అన్నాడు.

English summary
Due to the sudden demise of the Tamil Nadu CM Jayalalitha, the makers of the film have postponed the release date of Manoj’s Gunturodu teaser to pay their respects to the great leader. The news has bee officially announced by the hero of the movie Manoj himself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu