»   »  యోలేటి హీరో మనోజ్?

యోలేటి హీరో మనోజ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Manoj Kumar
'ఐతే,అనుకోకుండా ఒక రోజు' వంటి విభిన్న చిత్రాలతో తెలుగు తెరని థ్రిల్లింగ్ నేరేషన్ వైపు మరల్చిన దర్శకుడు యోలేటి చంద్రశేఖర్. ఆయన తాజాగా ఓ ప్రేమ కథతో రానున్నాడు. .ముఖ్యంగా ఆయన కథల్లో సాధారణంగా ఉండే ప్రథాన పాత్రలు సహజంగా బిహేవ్ చేస్తూ అసాధారణ మైన సమస్యలో కూరుకుపోతూ వెరైటీగా బయటపడాతారు. దాంతో ఆయన సినిమాలో హీరో చెయ్యాలంటే అందరికీ ఆసక్తే. ఇప్పుడు ఈ అరుదయిన అవకాసాన్ని అందిపుచ్చుకున్న హీరో మోహన్ బాబు తనయుడు మనోజ్.

మనోజ్ కెరీర్ ప్రారంభంనుండి ప్లాపులనే చిరునామాగా మార్చుకుని కదులుతున్నాడు.ఇలాంటి దసలో ఈ ఆఫర్ రావటం అతన్ని ఆనందానికి గురిచేస్తోంది. ఈ కథ మొత్తం స్టాక్ హోం,స్వీడన్ నేపధ్యంలో సాగుతుందిట.అందులోనూ షూటింగ్ లో అథిక భాగం విమానాశ్రయంలో జరుగుతుందిట. ఒకే ఒక్క పాట ఉండే ఈ సినిమాకి వెన్నెల ఫేమ్ మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం హీరోయిన్ కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం మనోజ్ 'నేనెవరో మీకు తెలుసా' సినిమా లో బిజీగా ఉన్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X