»   » వేరీ ఇంట్రస్టింగ్.... "మను" టీజర్ చూసారా..??

వేరీ ఇంట్రస్టింగ్.... "మను" టీజర్ చూసారా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్రహ్మ బ్రహ్మానందం తన తనయుడు గౌతమ్ ని హీరోగా నిలదొక్కుకునేలా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. పల్లకిలో పెళ్లి కూతురు , వారెవ , బసంతి లాంటి సినిమాలు చేసిన గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేక పోయాడు. దీంతో ఈ సారి ఎలాగైన మంచి విజయం సాధించాలనే కసితో ఉన్న గౌతమ్ వెరైటీ సబ్జెక్ట్ తో వస్తున్నాడు. ఫణీంద్ర నరిసెట్టి దర్శకత్వంలో తెరకెక్కనున్న మను చిత్రం కొత్త కథాంశంతో మిస్టరీ మరియు రొమాంటిక్ డ్రామాగా ఉంటుందని చెబుతున్నారు.

షార్ట్ ఫిలిమ్స్ తో నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకున్న ఫణీంద్ర నరిశెట్టి అనే దర్శకుడు ఈ మూవీ ని తెరకెక్కించాడు. గౌతమ్ కు జోడీగా చాందిని చౌదరి నటించింది. ఇటీవలే మను చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు..పెద్ద గా ఖర్చు పెట్టకుండా , తక్కువ లొకేషన్లలో సినిమా ని పూర్తి చేసినట్లు టీజర్ చూస్తే అర్ధం అవుతుంది..టీజర్ విషయానికి వస్తే ..టెక్నికల్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వాడినట్లు కనిపిస్తున్నాయి..బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్, అన్ని కూడా చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. టీజర్ చూస్తే డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కిన సినిమా లాగా అనిపిస్తుంది

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ని తాజాగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ సన్నింగ్ గా ఉండగా, టీజర్ తెలుగు ఆడియన్స్ కి చాలా కొత్తగా అనిపిస్తోంది. నరేష్ కుమరన్ ఈ చిత్రానికి సంగీతం అందిచాడు. హీరో శర్వానంద్, కమెడీయన్ వెన్నెల కిషోర్ తో సహా పలువురు సెలబ్రిటీలు గౌతమ్ నటిస్తోన్న తాజా చిత్రం మంచి విజయం సాధించనుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మరి మీరు చిత్ర టీజర్ పై ఓ లుక్కేయండి.

English summary
Star comedian Brahmanandam's son Gautam wos acted as a Hero in the Movi MANU Teazar and first look realeased
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu