»   » ప్రదీప్ ఆత్మహత్య : వివాహేతర సంబంధం వార్తలపై మండిపడ్డ పావని!

ప్రదీప్ ఆత్మహత్య : వివాహేతర సంబంధం వార్తలపై మండిపడ్డ పావని!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య వెనక రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. భార్య పావని వ్యవహారం నచ్చకనే ప్రదీప్ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని, శ్రవణ్ అనే వ్యక్తితో ఆమె చనువుగా ఉండటం ప్రదీప్ ఆ రోజు రాత్రి గొడవ పడ్డట్లు ప్రచారం మొదలైంది.

ఈ వార్తలపై మీడియా వారు నేరుగా ప్రదీప్ భార్య పావనిని ప్రశ్నించారు. శ్రవణ్ తో తనకు సంబంధముందని మాట్లాడటం సిల్లీగా ఉంది, శ్రవణ్ తో తనకు సంబంధమే ఉంటే, మూడు నెలల నుంచి అతన్ని ఇంట్లో ఉంచేందుకు ప్రదీప్ అంగీకరించేవాడా? అని పావని ఎదరు ప్రశ్నించింది.

శ్రవణ్ నా బ్రదర్ లాంటోడు

శ్రవణ్ నా బ్రదర్ లాంటోడు

శ్రవణ్ తనకు అన్నయ్య లాంటి వాడని, అన్నా చెల్లెల్లలాంటి తమ సంబంధంపై ఇలాంటి అనుమానాలు వ్యక్తం తనను చాలా బాధ పెట్టిందని పావని పేర్కొన్నారు.

క్షణికావేశంలో

క్షణికావేశంలో

ఆ రోజు రాత్రి జరిగింది చిన్న గొడవే అని, చిన్న విషయానికి తాను మామూలుగా అలిగి వెళ్లిపోయానని, అతిగా తాగిన మైకంలో ప్రదీప్ క్షణికావేశం ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, ప్రదీప్ గతంలో ఇలాంటి ప్రయత్నాలుగానీ, ఆత్మహత్య ఆలోచనలు గానీ చేయలేదని తెలిపారు పావని.

శ్రవణ్ వాదన

శ్రవణ్ వాదన

శ్రవణ్ కూడా పావనితో తనకు సంబంధం అంటగట్టి మాట్లాడటంపై మనస్తాపం వ్యక్తం చేసాడు. పావని తనకు చెల్లెలు లాంటిదని, ప్రదీప్ తనతో బాగా ఉండేవాడని, ఇద్దరం కలిసి సినిమాలకు, ఇతర చోట్లకు వేళ్లేవారమని, గొడవ జరిగిన రోజు కూడా ప్రదీప్ తనతో బాగానే ఉన్నాడని శ్రవణ్ తెలిపారు.

అనుమానం వ్యక్తం చేస్తున్న స్నేహితులు

అనుమానం వ్యక్తం చేస్తున్న స్నేహితులు

అయితే ప్రదీప్ ఆత్మహత్యపై అతని స్నేహితులు అనుమానాలు వక్తం చేస్తున్నట్లు సమాచారం. దుబాయ్ నుంచి మూడు నెలల క్రితం వచ్చిన శ్రవన్...వారింట్లోనే మకాం వేశాడని, ఈక్రమంలోనే వారి మధ్య గొడవలు ప్రారంభం అయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అంతరాత్రి గొడవ

అంతరాత్రి గొడవ

అర్ధరాత్రి 1:30 నిమిషాల నుంచి 4:30 నిమిషాల వరకు గొడవ జరిగితే... అది మామూలు గొడవే, చిన్న మిస్ అండర్ స్టాండింగ్ అని పావని చెప్పడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మంచం కింద ప్రదీప్ మృత దేహం

మంచం కింద ప్రదీప్ మృత దేహం

ప్రదీప్ శవం మంచం కింద ఉండటంపై కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ ఆత్మహత్యపై అనేక అనుమానాలున్నాయని, పోలీసులు తమదైన శైలిలో విచారించి నిజా నిజాలు వెలికి తీయాలని ప్రదీప్ కుటుంబ సభ్యులు, స్నేహితులు కోరుతున్నారు.

English summary
New issues are coming to the fore in the reported suicide of TV actor Pradip Kumar. Even as the police are awaiting his postmortem report, Pradip Kumar’s friends have alleged that one Sravan, staying with Pradip family for the last three months, could have killed the upcoming TV actor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu