»   » బాహుబలి2 ఓ సినిమా కాదు.. రకుల్ ప్రీత్ సింగ్.. ట్విట్టర్‌లో ఉప్పొంగిన ప్రముఖుల ట్వీట్ల వరద

బాహుబలి2 ఓ సినిమా కాదు.. రకుల్ ప్రీత్ సింగ్.. ట్విట్టర్‌లో ఉప్పొంగిన ప్రముఖుల ట్వీట్ల వరద

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమాపై ట్విట్టర్ల్‌లో కామెంట్ల వరద ఉప్పొంగుతున్నది. బాహుబలి2 సినిమా చూసిన తర్వాత నెటిజన్లు తమ సందేశాలతో పోటెత్తారు. స్టూడెంట్స్, ఉద్యోగుల నుంచి సినీ నటుల వరకు తమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి2పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాహుబలికి సినిమా నటులు కూడా అభిమానులుగా మారి ప్రత్యేక షోలకు క్యూ కట్టడం విశేషం. బాహుబలిపై స్పందించిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్, మంచు మనోజ్, అఖిల్, వెన్నెల కిషోర్ తదితరులు ఉన్నారు.

బాహుబలిని చూడటం ఓ అనుభవం

అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ బాహుబలిపై ప్రశంసల గుప్పించింది. బాహుబలి ఓ మ్యాజిక్. అది సినిమా కాదు. ఓ అనుభవం. ప్రతీ సీన్‌లో రోమాలు నిక్కపొడిచాయి. డైలాగ్స్, ఫెర్ఫార్మెన్స్ అదిరింది అని రకుల్ ట్వీట్ చేసింది.

ఆ ప్రశ్న అడుగ కూడదు.

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారో అని అడుగవద్దు. బాహుబలి2ను రాజమౌళి ఎలా తీశారో అని అడగాలి. సినిమా అద్భుతంగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమలో ఇలాంటి చిత్రం రావడం గర్వంగా ఉంది అని కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.

రాజమౌళి మీకు దండాలయ్యా..

ఇప్పుడే బాహుబలి2 సినిమా చూశాను. రాజమౌళి మీకు దండాలయ్యా. ప్రతీ ఫ్రేమ్, ప్రతీ ఒక్కరి నటన కట్టిపడేసింది. బాహుబలి సూపర్ అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.

నోట మాట రావడం లేదు..

బాహుబలి2 చూడటం నా జీవితంలో మధురమైన క్షణాలు. సినిమా చూసిన తర్వాత నా నోట మాట రావడం లేదు. ఏమి చెప్పాలో తెలియడం లేదు. చారిత్రాత్మకమైన సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పాలా? అని అఖిల్ అక్కినేని ట్వీట్ చేశాడు. అనుష్క, ప్రభాస్‌ల మధ్య రొమాన్స్ సీన్లు చాలా బాగున్నాయి అంటూ మరో ట్విట్‌లో పేర్కొన్నారు.

బ్లాక్ బస్టర్ కంటే పెద్దది..

బాహుబలి2 బ్లాక్‌బస్టర్ కంటే ఇంకా పెద్దది. చాలా ఎమోషనల్‌గా ఉంది. రోమాలు నిక్కపొడిచాయి. హ్యాట్సాప్ టూ రాజమౌళిగారు. యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్.. అని దర్శకుడు గోపిచంద్ మలినేని ట్వీట్ చేశాడు.

ఎక్సైట్‌మెంట్ ఆపుకోలేక..

నాకు బాహుబలి2 టికెట్లు శనివారం రాత్రికి బుక్ అయ్యాయి. అప్పటి వరకు ఎక్సైట్‌మెంట్ ఆపుకోలేక ట్విట్టర్‌లో వాలినాను అని వెన్నెల కిషోర్ ట్వీట్ చేశారు.

బాహుబలి2 మూడు రెట్లు పెద్దది

బాహుబలి1 కంటే బాహుబలి2 మూడు రెట్లు పెద్దది. భారతీయ సినిమా చరిత్రలో ఇలాంటి అద్బుతమైన సినిమా తీసిన ఎస్ఎస్ రాజమౌళికి మా ధన్యవాదాలు. ప్రభాస్ సూపర్ అంటూ పీఆర్వో వంశీ కాకా ట్వీట్ చేశాడు.

బాహుబలి2 మూడు రెట్లు పెద్దది

బాహుబలి2ను బ్లాక్‌బస్టర్‌గా వర్ణించడం చిన్న పదమై పోతుంది. కాస్త ఆగితే అసలు సినిమా రేంజ్ ఏంటో తెలిసిపోతుంది అని సినీ పీఆర్వో మహేశ్ ఎస్ కోనేరు ట్వీట్ చేశాడు.

English summary
Many celebraties and personalities are congratulating the team Baahubali in twitter. Rakul Preet singh tweeted that.. Blown away by d magic called #Baahubali2 ! It's not a film , it's an experience dt gives u goosebumps wd every scene ,dialogue n performance
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu