»   » బర్త్ డే బాయ్ రామ్ చరణ్ తేజ్: బర్త్ డే శుభాకాంక్షలు!

బర్త్ డే బాయ్ రామ్ చరణ్ తేజ్: బర్త్ డే శుభాకాంక్షలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రెండో చిత్రంతోనే బాక్సాఫీస్ దగ్గర సంచలనాత్మక వసూళ్లు కురిపించే చిత్రంలో మధ్యకాలంలో ఇంతటి ఘనవిజయం సాధించిన చిత్రం ఇదేనని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ రామ్ చరణ్ తేజ్ హడావిడికి దూరంగా మౌనంగా ఉన్నాడు. అంటే ఈ సక్సెస్ అతనిలో మార్సు తేలేదా? ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటున్నాడా? ఏదేతే నేం.

ఈ రోజు హీరో రామ్ చరణ్ పుట్టినరోజు. ఇప్పటికింకా సినిమా వయసు రెండేళ్ళే అయినా, రెండో సినిమాతోనే టాటీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. తెలుగు సినిమా స్థాయిని 'మగధీర" తో వసూళ్ళ పరంగా వందకోట్లకు పెంచిన చరణ్, ప్రస్తుతం బాబాయ్ నాగబాబు నిర్మాణంలో రూపొందుతోన్న 'ఆరెంజ్" సినిమాలో నటిస్తోన్న సంగతి తెల్సిందే.

పుట్టినరోజు వేడుకల్ని అభిమానులకు దూరంగా ఆస్ట్రేలియాలో జరుపుకుంటున్నాడు చరణ్. షూటింగ్ నిమిత్తం ఆస్ట్రేలియాలో వున్న చరణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొనేందుకు చిరంజీవి, ఆయన భార్య ఆస్ట్రేలియా చేరుకున్నారు. అభిమానులు షరామామూలుగానే ఊరూవాడా చరణ్ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహిస్తున్నారు. రక్తదానం, అన్నదానం వంటి కార్యక్రమాల ద్వారా మెగాభిమానులు తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు.

'చిరుత" తర్వాత రెండేళ్ళకు 'మగధీర" వచ్చినట్టు కాకుండా, త్వరలోనే తన కొత్త చిత్రంతో అభిమానుల ముందుకు రావాలని కోరుకుంటూ రామ్ చరణ్ కి దట్స్ తెలుగు తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేద్దాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu