»   » సుమన్ వద్దని చెప్పినా.... చిరంజీవిపై ఆగని ఏళ్లనాటి పుకార్లు!

సుమన్ వద్దని చెప్పినా.... చిరంజీవిపై ఆగని ఏళ్లనాటి పుకార్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ తరం వాళ్లకి తెలియదు కానీ.... నటుడు సుమన్ ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరో. ఆ రోజుల్లో ఆయన వరుస హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. అయితే 30 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన సుమన్ కెరీర్‌ను తారుమారు చేసింది అంటుంటారు.

అప్పట్లో సుమన్ అన్యాయంగా ఓ కేసులో జైలుకెళ్లారు. ఈ వ్యవహారం ఇండస్ట్రీలో ఆ రోజుల్లో పెను దుమారానికి కారణం అయింది. ఈ సంఘటన జరిగిన దాదాపు 30 ఏళ్లు జరిగినా, అప్పటి పీడకలను సుమన్ సైతం మరిచి పోయినా.... ఇప్పటికీ కొందరు ఆ విషయాన్ని తెరపైకి తెస్తూ చిరంజీవిని ఆడిపోసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

30 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

30 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

దాదాపు 30 ఏళ్ల క్రితం సుమన్ అప్పుడప్పుడే ఇండస్ట్రీలో హిట్స్ కొడుతూ ఎదుగుతున్న రోజులు. అప్పట్లో సుమన్ బ్లూ ఫిల్మ్ కేసులో ఇరుక్కోవడం సెన్సేషన్ అయింది. ఈ కేసులో అప్పట్లో ఆయన జైలు గడపతొక్కారు. ఏడాది శిక్ష అనుభవించారు.

Chiranjeevi 151 Movie Title Changed
సుమన్ మీద కుట్ర

సుమన్ మీద కుట్ర

అప్పట్లో ఈ కేసు వ్యవహారంలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. సుమన్ ఎదుగుదలను తట్టుకోలేక కొందరు కావాలనే కుట్ర చేసిన ఆయన్ను ఇరికించారనే ప్రచారం కూడా మొదలైంది. అలా వినిపించిన వారి పేర్లలో చిరంజీవి పేరు కూడా ఉంది.

చిరంజీవికి సంబంధం లేదన్న సుమన్

చిరంజీవికి సంబంధం లేదన్న సుమన్

తను ఈ కేసులో ఇరుక్కోవడానికి కారణం చిరంజీవి అనే వాదనను సుమన్ కూడా అప్పట్లో ఖండించారు. తర్వాత చాలా సందర్భాల్లో ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. ఆయనకు దీంతో ఎలాంటి సంబంధం లేదు, దయచేసి చిరంజీవి పేరు ఎత్తకండి అంటూ అప్పట్లో సుమన్ బాహాటంగా చెప్పారు.

చిరంజీవి చాలా మంచి వ్యక్తి

చిరంజీవి చాలా మంచి వ్యక్తి

చిరంజీవి చాలా మంచి వ్యక్తి, ఇలాంటి పనులు చేసేంత సంస్కార హీనుడు కాదని సుమన్ కూడా పలు ఇంటర్వ్యూలో ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యవహారంలో చిరంజీవి పేరొచ్చినప్పుడల్లా సుమన్ కండిస్తూ వస్తూనే ఉన్నారు.

చిరుతో కలిసి నటించిన సుమన్

చిరుతో కలిసి నటించిన సుమన్

ఈ కేసు వ్యవహారంలో తన మనసులో చిరంజీవి మీద ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేస్తూ..... చిరంజీవితో కలిసి కొన్ని సినిమాల్లో కూడా నటించారు సుమన్. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది స్టాలిన్ మూవీ.

ఎన్టీఆర్ ప్రభుత్వంపై కూడా ఆరోపణలు

ఎన్టీఆర్ ప్రభుత్వంపై కూడా ఆరోపణలు

చిరంజీవి మీద మాత్రమే కాదు... ఎమ్జీఆర్ ప్రభుత్వం మీద కూడా అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఓ పథకం ప్రకారం తమిళంలో సుమన్‌ను ఓ స్టార్‌గా ఎదగనీయకుండా ఇలా చేసిందని మరో ఊహాగానం కూడా ఉంది.

స్నేహితులే కారణమా?

స్నేహితులే కారణమా?

సుమన్ తన స్నేహితుల కారణంగానే ఈ కేసులో ఇరుక్కున్నారనే మరో వాదన కూడా ఉంది. ఏది ఏమైనా చేయని తప్పుకు సుమన్ శిక్ష అనుభవించారనే జాలి ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది.

English summary
Some gossips are so strong in film industry that they are carrying forward from years. Among one such things, the most silently talked and which is being forced on youngsters is that Megastar Chiranjeevi has killed the career of hero Suman. "he's not responsible for that and he's not such a guy. Chiru is a devotee of Lord Hanuman and he never indulges in such things. In fact, he gave me break by roping me as character artist in his films", said Suman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu