»   » 'మరోచరిత్ర' రీమేక్ ఐడియా అలా పుట్టింది

'మరోచరిత్ర' రీమేక్ ఐడియా అలా పుట్టింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇంగ్లిష్‌ లో 'రొమియో జూలియట్‌' చిత్రానికి ఎంత విశిష్టత వుంటుందో, తెలుగులో 'మరోచరిత్ర'కు అంతకు మించిన సముచిత స్థానం వుంది. ఇలాంటి గొప్ప చిత్రాన్ని అమెరికా, న్యూయార్క్‌ల నేపథ్యం టలో తెరకెక్కిస్తే ఎలా వుంటుంది అనే నా ఆలోచనలకు దృశ్యరూపమే ఈ 'మరోచరిత్ర' అంటున్నారు రవియాదవ్. ఆయన తొలిసారి దర్శకుడుగా పరిచయం అవుతూ చేస్తున్న ఈ చిత్రం రేపు(గురువారం) రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం విశేషాలను మీడియాకు వివరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ....ఒకసారి నేను కెమెరామన్‌గా వర్క్‌ చేస్తున్న ఓ చిత్రం షూటింగ్‌ కోసం అమెరికా వెళ్ళాను. అక్కడి వాతావరణం చూశాక.. అమెరికా నేపథ్యంలో మంచి స్క్రిప్ట్‌తో ఒక ప్రేమకథను తెరకెక్కిస్తే ఎలా వుంటుంది...? అనే ఆలోచన వచ్చింది. అప్పుడు నా కళ్ల ముందు మెదిలిన అద్భుత ప్రేమ దృశ్య కావ్యం 'మరోచరిత్ర' అన్నారు.

ఇక కమల్ 'మరో చరిత్ర'కి ఏ మార్పులు చేసి అందిస్తున్నారు అన్న దానికి సమాధానంగా కథలోని ఆత్మ, అందులోని భావోద్వేగాలు యథాతథంగా వుంటాయి. కాకపోతే నేటితరం ప్రేక్షకుల అభిరుచికి సరిపోయే అన్ని అంశాలను ఈ చిత్రంలో జతచేశాం అన్నారు. అలాగే తాను ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసేటప్పుడు సక్సెస్‌, ఫెయిల్యూర్‌ల గురించి ఆలోచించలేదనీ, ఆ చిత్రం లోని భావోద్వేగాలకు భంగం కలగకుండా, నిజాయితీగా సినిమా చేయాలని అనుకుని చేశానన్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ 'మరోచరిత్ర' లో వరుణ్‌ సందేశ్‌, అనిత, శ్రద్ధా దాస్‌ నటించారు. రేపు (మార్చి 25)న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రవియాదవ్ గతంలో కెమెరామన్‌గా తమిళంలో 10 సినిమాలు, బాలీవుడ్‌లో దాదాపు పది సినిమాలకు వర్క్‌ చేశారు. తమిళంలో నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీశారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu