»   » 'మరో చరిత్ర' రీమేక్ ఎంతదాకా వచ్చింది?

'మరో చరిత్ర' రీమేక్ ఎంతదాకా వచ్చింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏడు నెలలు కృషి చేసి స్క్రిప్ట్‌ను తయారు చేశాం. ఎనిమిది నెలల క్రితమే సినిమాలోని పాటలను రికార్డ్‌ చేశాం. మిక్కీ అద్భుతంగా పాటలను కంపోజ్‌ చేశారు. విజువల్‌ బ్యూటీ మిస్‌ కాకుండా సినిమాని, పాటలను ఎంతో అందంగా తీర్చిదిద్దారు రవి యాదవ్‌. ఫిబ్రవరి 14న చిత్రం ఆడియోను విడుదల చేస్తున్నాం. సమ్మర్‌ లో సినిమా రిలీజ్‌ ఉంటుంది' అంటూ 'మరో చరిత్ర' చిత్రం రీమేక్ విశేషాలను నిర్మాత రాజు చెప్పుకొచ్చారు. అలాగే 'విభిన్న,ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించాలనే అభిప్రాయంతోనే మాట్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే కొత్త బేనరును ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.

కమల హాసన్‌, సరిత కాంబినేషన్‌లో కె.బాలచందర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'మరోచరిత్ర' చిత్రాన్ని దిల్ రాజు వరుణ్ సందేశ్, అనిత అనే నూతన నటి కాంబినేషన్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ నాటి పరిస్థితులకు అనుగుణంగా కధను మార్చి మోడరన్‌ ఎప్రోచ్‌ తో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఈ మధ్యనే పూర్తయింది.'మరో చరిత్ర' రచయిత్రి అనూరాధ ఈ సినిమాకి కూడా రచన చేస్తారన్నారు.

దర్శకుడు రవి యాదవ్‌ మాట్లాడుతూ 'తమిళ, తెలుగు, హిందీ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన నేను ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది.చరిత్ర సృష్టించిన సినిమాని తిరిగి తీస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నాను. నిర్మాత రాజుగారి సహకారంతో ఈ సినిమాని బాగా తీయగలిగాను. ప్రేమికులకు ప్రేమ ఎంత ముఖ్యమో తల్లితండ్రులు కూడా అంతే ముఖ్యమని ఈ సినిమాలో చెబుతున్నాం. అన్నారు. పాత సినిమాలోని మూడు పాటల పల్లవులు తీసుకుని రీమిక్స్‌ చేయడం జరిగింది. అమెరికా, కెనడా, దుబాయ్‌, వైజాగ్‌, హైదరాబాద్‌ల్లో షూటింగ్‌ జరిగింది' అన్నారు.

ఇక ఈ చిత్రం కీలక పాత్రల్లో కోట శ్రీనివాసరావు, ప్రతాప్‌ పోతన్‌, ఊర్వశి, తలైవాసల్‌ విజయ్‌, జానకి సబేష్‌, ఆదర్శ్‌, వేణు, వెంకీ తదితరులు నటిస్తున్నారు. 'మరో చరిత్ర' చిత్రానికి మూల కథ: కె.బాలచందర్‌, మాటలు: ఉమర్జీఆనంద్‌, సంగీతం: మికీ జె.మేయర్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వంచా జగన్‌ మోహన్‌ రెడ్డి, నిర్మాతలు: రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌, స్క్రీన్‌ప్లే, ఛాయాగ్రాహణం, దర్శకత్వం: రవి యాదవ్‌. ఇక హీరోగా చేస్తున్న వరుణ్ సందేశ్ ఇంతకు ముందు దిల్ రాజు బ్యానర్ లో కొత్త బంగారు లోకం చిత్రంలో నటించాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X