»   » పెళ్లి పాటలో బాలకృష్ణ కేక

పెళ్లి పాటలో బాలకృష్ణ కేక

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : 'సింహా' తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. బాలకృష్ణ సరసన సోనాల్‌ చౌహాన్‌ ఓ హీరోయిన్ గా చేస్తోంది. ఇందులో ఇంకో హీరోయిన్ కి చోటుంది. 14రీల్స్‌ పతాకంపై గోపీ ఆచంట, రామ్‌ ఆచంట, అనిల్‌ సుంకర, సాయి కొర్రపాటి సినిమాని నిర్మిస్తున్నారు. ఫ్లెక్స్‌ హౌస్‌లో ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఓ పెళ్లి గీతాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కించారు. ఈ నెల 10 వరకు ఇక్కడ చిత్రీకరణ జరుగుతుంది. ఇక పెళ్లి పాటలో బాలకృష్ణ చాలా బాగున్నాడని చెప్తున్నారు.

ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే అంచనా అభిమానుల్లో ఉండటం సహజం. ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అన్నారు. అలాగే బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు, అభిమానులూ ఏం కోరుకొంటారో అవన్నీ మేళవిస్తూ.. ఆయన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. రాజకీయ అంశాలూ ఉంటాయా? అని అందరూ అడుగుతున్నారు. అవీ ఉంటాయి. కానీ.. కథకు ఎంత వరకూ అవసరమో అంతే. ఆ గీత దాటి బయటకు వెళ్లవు అన్నారు.

అలాగే ఇందులో రాజకీయ అంశాలుంటాయని కూడా భావిస్తున్నారు. నేను కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిని కాబట్టి.. ఆ విలువలు కచ్చితంగా ఈ చిత్రంలో ఉంటాయి. భావోద్వేగాలు ఉంటాయి. 'సింహా'లో బాలయ్యలో కనిపించిన వాడి వేడి ఏ మాత్రం తగ్గవు. అందరూ అనుకుంటున్నట్లు రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఉంటాయో లేదో చెప్పలేను. ఒకవేళ ఉంటే.. పైన చెప్పిన అంశాలకు ఇవి బోనస్ అవుతాయి. అంతేకానీ అవి లేకుండా పాలిటిక్స్‌కే పరిమితం అయ్యే సినిమా కాదు.

బాలకృష్ణగార్ని దృష్టిలో పెట్టుకొని చేసిన కథ ఇది. ఏ సినిమాకైనా టిక్కెట్ తెగేది హీరోని చూసే. 50, 60 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంటే అది హీరోని చూసే. అందుకే నా సినిమాల్లో హీరోని వేరే ఏ ఇతర పాత్రలూ డామినేట్ చేయనివ్వను. నా సినిమాల్లో నా హీరోనే హైలైట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను. నేను ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి అభిమానిని అని భావిస్తా. అప్పుడే ఓ అభిమాని ఆ హీరో నుంచి ఏమేం ఎదురు చూస్తున్నాడో అవన్నీ చేయగలుగుతా.

బాలకృష్ణ సినిమాలో జగపతిబాబు విలన్ గా కనిపించనున్నాడని సమాచారం. వరస ప్లాపుల్లో ఉన్న జగపతిబాబు తన రూటు మార్చుకుని ఇలా విలన్ గా కనిపించి అలరించనున్నట్లు తెలుస్తోంది. నెరిసిన గడ్డంతో ఈ సినిమాలో కనిపిస్తాను. ఇందులో మూడు తరాలకు సంబంధించిన పాత్రల్లో కనిపిస్తాను. యంగ్, మిడిల్, ఓల్డ్ ఏజ్ గెటప్స్. ఈ కథ, కేరెక్టర్ విన్న తర్వాత బాడీ లాంగ్వేజ్‌ని ఎలా కావాలంటే అలా మార్చుకుని చేస్తానని బోయపాటితో అన్నాను. మనస్ఫూర్తిగా ఇష్టపడి చేస్తున్న పాత్ర ఇది అంటూ చెప్పుకొచ్చారు జగపతిబాబు. విలన్ కేరక్టరే అయినా రొటీన్‌కి భిన్నంగా ఉంటుంది. పంచెలు కట్టుకుని, పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని ఆ టైప్‌లో ఉండదు. చాలా స్టయిలిష్‌గా ఉంటుంది. ఇటాలియన్ స్టయిల్‌లో ఉంటుంది. బేసిక్‌గా నాకా స్టయిల్ ఇష్టం. బాలయ్య పాత్రతో ఢీ అంటే ఢీ అనే తరహా పాత్ర నాది. ఇలాంటి పాత్ర కోసమే ఎదురు చూస్తున్నాను.

English summary
Balakrishna, Sonal Chauhan starrer ‘Jayasimha’ under the direction of Boyapati Srinu is currently progressing in RFC. A wedding song is progressing underway in Flex House, RFC on various stars. Gopi Achanta,Ram Achanta,Anil Sunkara and Sai Korrapati are producing the film on 14 Reels banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu