»   »  రైటర్స్ వార్ రేపే...

రైటర్స్ వార్ రేపే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Adhyaksha
రేపు రెండు చిన్న సినిమాలు రిలీజు కానున్నాయి. కాకపోతే అందులో విశేషమేమిటంటే ఆ సినిమా దర్శకులిద్దరూ ముందుగా సినీ రచయితలుగా ప్రశిద్దులు కావటం. వారే మరుధూరి రాజా, జొన్న విత్తుల రామలింగేశ్వరరావు. దాంతో వీరిద్దరి మథ్యా పోటీ పెట్టినట్లయింది. మరుధూరి రాజా బ్రహ్మాజీ హీరోగా 'అధ్యక్ష్యా!' ని తీర్చిదిద్దితే, జొన్న విత్తుల అలీ హీరోగా 'సోంబేరి' ని రెడీ చేసారు. ఇలా ఇద్దరూ లో బడ్జెట్ సినిమాలతో ముందుకు వస్తున్నారు.

అలాగే రెగ్యులర్ గా మరుధూరి రాజా రాసే సినిమాల్లో కామిడీకి ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఆయన చేస్తున్న 'అధ్యక్ష్యా!' సినిమా సీరియస్ గా ఉంటుందిట. ఇక జొన్నవిత్తుల పాటల రచయితగా సుప్రసిద్దుడు. కానీ 'సోంబేరి' సినిమా కామిడీతో ఉంటుందిట. మరి ఈ కలం వీరులైన వీరిద్దరులో ఎవరిని భాక్సాఫీస్ కరుణిస్తుందో చూడాలి. ఎందుకంటే ఏ సినిమాపైనా ప్రేక్షకులలో హైపు అంచనాలు లేవు. కథ బాగుంటే నిలబడతాయి. లేకుంటే చెప్పుకోవటానికే మిగులుతాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X