»   » 'ప్రేమ కథా చిత్రమ్' కి 'కాంచన' కి పోలికపై మారుతి

'ప్రేమ కథా చిత్రమ్' కి 'కాంచన' కి పోలికపై మారుతి

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : రీసెంట్ గా విడుదలైన మారుతి చిత్రం 'ప్రేమ కథా చిత్రమ్'. మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంకి లారెన్స్ 'కాంచన' కి పోలికలు ఉన్నాయి...ప్రేరణ పొందారు వంటి వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో దర్శకపర్యవేక్షణ, కథ అందించిన మారుని మీడియా ప్రశ్నించింది. దానికి మారుతి అసలు తాను 'కాంచన' చిత్రం చూడలేదంటూ సమాధానమిచ్చారు.

మారుతి మాట్లాడుతూ....నేను ఓపెన్ గా చెప్తున్నాను...నేను ఏ సినిమా నుంచీ ప్రేరణ పొందలేదు. నేను కొన్ని సీన్స్...'ముని' లోవి టీవిలో చూసాను. నేను 'కాంచన' చూడలేదు. కొంతమంది చూడమని సజెస్ట్ చేసారు కానీ.. 'కాంచన' సీడీ దొరకలేదు. నేను బెల్లంకొండ సురేష్ గారి ని సైతం ఆ సినిమా గురించి అడిగాను.

అలాగే ఒక సినిమా చూసినట్లైతే...కొన్ని సీన్స్ ప్రేరణ పొందే అవకాసం ఉంది. నాకు కాపీ రైటర్ అనే ఇమేజ్ తెప్పించుకోవాలనే కోరిక లేదు. నేను ఏదనుకుంటున్నానో అదే..రాసి సెట్స్ మీదకు వెళతాను. ఇది నా బ్రెయిన్ ఛైల్డ్ అన్నారు.

ప్రేమకథా చిత్రమ్ ఈ నెల 7న విడుదలై అంచనాలకు మించి బాక్సాఫీసు వద్ద ఫలితాలు సాధిస్తోంది. సినిమా ఇంట్రస్టింగ్ స్టోరీలైన్, స్క్రీన్ ప్లే, స్ర్కిప్టు..... నటీనటుల పెర్ఫార్మెన్స్ ఫలితంగా మంచి టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్ల పరంగా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు సంతృప్తిని మిగిల్చింది. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో, జె ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సినీ విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందడంతో పాటు, పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో తొలిరోజైన శుక్రవారం ఈ చిత్రం ఓవరాల్‌గా రూ. 3.14 కోట్లు వసూలు చేసింది.

English summary

 'Premakatha Chitram' Maruthi Says "I openly say that I am not inspired from any movie. I have scene some portions of 'Muni' in T.V, and I have not seen 'Kanchana', though some have suggested to watch it. I did not get the CD of that movie, and I even asked Suresh (Bellamkonda Suresh) sir for it. But if we watch a particular movie, there is a fair chance of getting inspired from some scenes when writing the script. And I don't like the image of a copy cat. So I have written whatever I have got in my mind and went to he sets. The story is my brainchild."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu