»   » నయనతార కాదు, ఫ్రెష్ ఫేసు కోసమే ఎదురు చూస్తున్నాం: మారుతి

నయనతార కాదు, ఫ్రెష్ ఫేసు కోసమే ఎదురు చూస్తున్నాం: మారుతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ నయనతార సౌతిండియాలో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్. అదే విధంగా ఆమె అనేక వివాదాల్లోనూ ఇరుక్కుంది. శింబుతో ప్రేమాయణం, ప్రభుదేవాతో ఎఫైర్....అబ్బో ఇలా చెప్పుకుంటే పోతే నయనతార సినిమా లైఫ్, పర్సనల్ లైఫ్ రెండు భిన్నంగా ఉంటాయి. ఆ విషయాల గురించి పక్కన పెడితే సెకండ్ ఇన్నింగ్స్‌లో నయనతార మళ్లీ వరుస హిట్లతో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే.

తాను గతంలో కలిసిన నటించిన పలువురు స్టార్ హీరోలతో మళ్లీ అవకాశాలు దక్కించుకుంటుంది. వెంకటేష్, మారుతి కాంబినేషన్లో రాబోయే 'రాధ' చిత్రంలో ఆమెను తీసుకోబోతున్నారంటూ ఆ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు మారుతి స్పందించారు. నయనతారను తీసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇప్పటికే నయనతార వెంకటేష్ రెండు సినిమాల్లో కలిసి నటించారు. నేను మళ్లీ ఈ జోడీని రిపీట్ చేయదలుచుకోలేదని తెలిపారు. ఫ్రెష్ ఫేసును తీసుకోవాలని చూస్తున్నట్లు వెల్లడించారు.

Nayanatara

ప్రస్తుతం మారుతి 'కొత్త జంట' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం తాను 'కొత్త జంట' సినిమా షూటింగులో బిజీగా గడుపుతున్నానని, వచ్చే ఏడాది వాలంటైన్స్ డే సందర్భంగా సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. ఆ తర్వాత వెంకటేష్‌తో చేయబోయే 'రాధ' చిత్రంపై దృష్టి సారిస్తానని తెలిపారు.

ఇక నయనతార విషయాల్లోకి వెళితే...తమిళంలో 'రాజా రాణి', 'ఆరంభం' చిత్రం విజయాలతో మంచి జోరుమీద ఉన్న నయనతార....తన మాజీ ప్రియుడు శింబుతో కలిసి మరో చిత్రంలో నటించబోతోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'అనామిక' చిత్రంలో నటిస్తోంది.

English summary
It was reported earlier that actress Nayantara would team up with Daggubati Venkatesh for the third time in his upcoming movie Radha. But director Maruthi has slammed the reports stating that he has not signed Nayan yet for the film as he is keen to cast a fresh face with the Victory star in the romantic-drama.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu