»   » లెజెండరీ దర్శకుడి రెండు సినిమాలనీ కలిపేసాడు, మారుతీ సినిమా ఇదా..??

లెజెండరీ దర్శకుడి రెండు సినిమాలనీ కలిపేసాడు, మారుతీ సినిమా ఇదా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లు తెరకెక్కించటంతో దర్శకుడు మారుతి సెపరేట్ స్టైల్. దర్శకుడు మారుతి ఆలోచనలు అన్నీ కుర్రకారు చుట్టూనే తిరుగుతాయి. అందుకే భలే భలే మగాడివోయ్ తో సహా తీసిన సినిమాలన్నీ, కుర్రాళ్ల సరదాలు వ్యవహారాలు చుట్టూ తిరిగినవే.

భలేభలే మాత్రం క్లాస్ ఫ్యామిలీ టచ్ వున్న కామెడీ కావడంతో దర్శకుడు మారుతి ఓల్ట్ సినిమా హిస్టరీ అంతా మరిచిపోయేలా చేసింది. మొదట్లో అడల్ట్ కంటెంట్ ఉన్న కథలతో సక్సెస్ సాధించిన మారుతి తరువాత రూట్ మార్చి రొమాంటిక్ ఎంటర్ టైనర్ లను అంధిస్తున్నాడు. అయితే ఇప్పుడు మారుతీ కొత్త సినిమా టైతిల్ మాత్రం కొంచం విచిత్రంగానే ఉంది

maruthi new movie aakali rajyam lo anthu leni katha

దర్శకుడే అయినా నిర్మాతగా కొత్త దర్శకులను పరిచయం చేస్తూ యూత్ ఫుల్ కథలతో సినిమాలను తెరకెక్కిస్తున్న మారుతీ ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ తో సినిమాను రెడీ చేస్తున్నాడు మారుతి.,,రోజులు మారాయి సినిమా ఫేం మురళి దర్శకుడిగా కొత్త నటీనటులతో ఆకలిరాజ్యంలో అంతులేని కథ పేరుతో సినిమాను రూపొందిస్తున్నాడు.

లెజెండరీ దర్శకుడు బాలచందర్ రూపొందించిన రెండు సినిమాల టైటిల్స్ ను ఈ సినిమాకు టైటిల్ గా ఎంచుకున్నాడు. తానే కథ అందిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమకాలీన సమస్యలను ప్రస్తావిస్తున్నాడట మారుతి. ఇప్పటికే ఈ సినిమాను షూటింగ్ 50 శాతానికి పైగా పూర్తయిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో ఇద్దరు కొత్త హీరోలు ఇండస్ట్రీ పరిచయం అవుతున్నారు.

English summary
Tollywood Director Maruthi new movie aakali rajyam lo anthu leni katha..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu