»   » అదరకొట్టారు...ఈ ట్రైలర్ మిస్ కావద్దు(వీడియో)

అదరకొట్టారు...ఈ ట్రైలర్ మిస్ కావద్దు(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రియాంక పంచ్‌కు బాక్సాఫీస్ బ్రద్దలయ్యేటట్లు కనపడుతోంది. 'మేరికోమ్‌'... ప్రియాంకా చోప్రా ప్రాణాలన్నీ పెట్టి నటించిన చిత్రం. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే ప్రియాంక ట్రైలర్ లు విడుదలై బాలీవుడ్‌లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. బాక్సింగ్‌ క్రీడాకారిణి మేరికోమ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబరు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ ట్రైలర్ మీరూ చూడండి.

<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/OxsKcx1IwI8" frameborder="0" allowfullscreen></iframe></center>

ప్రియాంక మాట్లాడుతూ ''బాగ్‌ మిల్కా బాగ్‌'తో ఈ చిత్రాన్ని పోల్చలేం. ఎందుకంటే ఓ క్రీడాకారిణి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న తొలి చిత్రమిది. క్రీడా చిత్రాల్లో ఓ ట్రెండ్‌ అనడం ఈ చిత్రాన్ని అగౌరవపరచడమే. దేశం గర్వించదగ్గ చిత్రం'' అని చెప్పింది.

Mary Kom official trailer: Dont miss it !

అలాగే...ఈ చిత్రం ఈ చిత్రాన్ని మామూలు రెగ్యులర్ సినిమాల్లా పరిగణించవద్దని ఆమె కోరింది. తన నట జీవితంలో ఈ సినిమాకు కష్టపడినట్లు ఏ సినిమాకూ కష్టపడలేదని తెలిపింది. మేరీ వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి క్రీడా ప్రపంచంలో రాణించటమంటే మాటలు కాదని, అటువంటి అద్బుతాన్ని మేరీ సాధించిందని ఆమెను ప్రియాంత పొగడ్తల్లో ముంచెత్తింది.

ఇక ఈ చిత్రంలో మేరిలీ శరారీకృతిని ప్రదర్శించటానికి రోజుకు పదిహేను గంటలు పాటు శిక్షణ పొందాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. భాక్సింగ్ లో ప్రవేశించేందుకు మేరీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని, ఆమె తండ్రి భాక్సింగ్ వద్దని కట్టడి చేసినా పట్టుదలగా నేర్చుకుని ప్రపంచస్ధాయిలో మన దేశ కీర్తి పతాకం ఎగిరేలా ఒలింపిక్స్ లో పతకం సాధించిందని వివరించింది. ఈ చిత్రానికి దర్శకుడు ఒమాంగ్ కుమార్. సెప్టెంబర్ ఐదున ఈ చిత్రం విడుదల కానుంది.

English summary
After the gritty posters and teaser of upcoming biopic Mary Kom created a buzz in the Bollywood, the first full-fledged trailer of the Priyanka Chopra-starrer film has been released
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu