twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సొంత ఊళ్లో రిలీజ్ కాకపోతే బాధే మరి

    By Srikanya
    |

    ముంబై: తమ సినిమానో లేక తాము నటించిన చిత్రమో లేక...తమ జీవితం ఆధారం రూపొందిన చిత్రమో తమ ఊళ్లో తమ వాళ్ల మధ్యన చూడాలని ఎవరికైనా ఉంటుంది. అందుకు ప్రముఖ బాక్సింగ్‌ క్రీడాకారిణి మేరీకోమ్‌ అతీతురాలేమీ కాదు. అయితే ఆమెకు అలాంటి అవకాసం కనిపించేటట్లు లేదు.ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రలో నటించిన 'మేరీకోమ్‌' చిత్రం ఇటీవలే విడుదలైంది. అయితే 2000 సంవత్సరం నుంచి మణిపూర్‌లో హిందీ చిత్రాలపై నిషేధం ఉన్న విషయం ఉంది. దాంతో అక్కడ రిలీజ్ లేదు.

    మేరీ కోమ్ మాట్లాడుతూ... ''నా జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాను ప్రపంచంలో అందరూ చూస్తున్నారు. నా సొంత గడ్డ మణిపూర్‌ ప్రజలకు ఆ అవకాశం లేకుండా పోవడం బాధగా ఉంది. ఈ చిత్రం మణిపూర్‌లో విడుదల చేయాలనుకోవడం రిస్క్‌తో కూడుకున్న పని. ఒక్కొసారి ప్రదర్శించకపోవడమే మంచిదనిపిస్తోంది. అయితే సినిమా విడుదలకు ప్రభుత్వంతో కలసి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను'' అన్నారు.

    భారతీయ బాక్సర్‌ మేరీకోం జీవితం ఆధారంగా తీసిన సినిమా 'మేరీకోం'కి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంకాచోప్రా మేరీకోం పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మొన్న శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది.

    Mary Kom sad about her biopic not being screened in Manipur

    సాధారణ కుటుంబంనుంచి వచ్చిన ఒక మహిళ కృషి, దృఢచిత్తాలతో ఇంతటి ఉన్నతమైన స్థాయికి ఎదిగి విశ్వవేదికలపై భారత పతాకను ఎగరవేయడం దేశానికే గర్వకారణమని, ఆమె జీవితంనుంచి అందరూ స్ఫూర్తి పొందాలనే ఈ పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. చిత్ర బృందం అందుకు కృతజ్ఞతలు తెలిపింది. మేరీకోమ్‌' నాయికా ప్రాధాన్య చిత్రం కాదని, దాన్ని సాధారణ చిత్రంలాగే చూడాలని ఆ చిత్ర నాయిక ప్రియాంక చోప్రా అన్నారు.

    ప్రియాంక చోప్రా మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని మామూలు రెగ్యులర్ సినిమాల్లా పరిగణించవద్దని ఆమె కోరింది. తన నట జీవితంలో ఈ సినిమాకు కష్టపడినట్లు ఏ సినిమాకూ కష్టపడలేదని తెలిపింది. మేరీ వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి క్రీడా ప్రపంచంలో రాణించటమంటే మాటలు కాదని, అటువంటి అద్బుతాన్ని మేరీ సాధించిందని ఆమెను ప్రియాంత పొగడ్తల్లో ముంచెత్తింది.

    ఇక ఈ చిత్రంలో మేరిలీ శరారీకృతిని ప్రదర్శించటానికి రోజుకు పదిహేను గంటలు పాటు శిక్షణ పొందాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. భాక్సింగ్ లో ప్రవేశించేందుకు మేరీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని, ఆమె తండ్రి భాక్సింగ్ వద్దని కట్టడి చేసినా పట్టుదలగా నేర్చుకుని ప్రపంచస్ధాయిలో మన దేశ కీర్తి పతాకం ఎగిరేలా ఒలింపిక్స్ లో పతకం సాధించిందని వివరించింది. ఈ చిత్రానికి దర్శకుడు ఒమాంగ్ కుమార్.

    English summary
    M C Mary Kom’s hometown is missing the screening of the Priyanka Chopra-starrer biopic on the boxing champion as no theatre in Manipur is screening the film due to a ban by insurgency outfits.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X