బాలకృష్ణ సరసన సునీల్ హీరోయిన్ ఎంపిక

By Srikanya

సునీల్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన 'మర్యాద రామన్న' చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టన భామ సలోని. అయితే ఆ చిత్రం తర్వాత ఆమెకు చెప్పుకోతగ్గ ఆఫర్స్ రాలేదు. తెలుగుఅమ్మాయి అనే చిత్రంలో చేస్తున్న ఈమె తాజాగా బాలకృష్ణ చిత్రంలో ఒక హీరోయిన్ గా బుక్కయ్యింది. శ్రీకీర్తి కంబైన్స్‌ సంస్థ పతాకంపై ఎమ్‌.ఎల్‌.పద్మకుమార్‌ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒక హీరోయిన్ ఇప్పటికే లక్ష్మీరాయ్‌ ఎంపికైంది. మరో హీరోయిన్ గా సలోనిని ఎంపికచేసారు. ఈ విషయంపై తన ఆనందాన్నివ్యక్తం చేస్తూ "బాలకృష్ణతో కలిసి నటించాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా. ఆ అవకాశం ఇప్పటికి దొరికింది. మాస్‌ మసాలా పాత్రలో కనిపిస్తాను. ఇప్పటివరకు చేయని ఒక వైవిధ్యమైన పాత్ర ఈ సినిమాతో దక్కడం ఆనందంగా ఉంది. ఈ నెల 11 నుంచి షూటింగ్ లో పాల్గొంటానని చెప్తోంది. ఈ చిత్రంలో జయసుధ, నదియా, ప్రదీప్‌రావత్‌, ఆదిత్య మీనన్‌, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సమర్పణ: సందీప్‌, సంగీతం: కల్యాణిమాలిక్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X