'మర్యాదరామన్న' రీమేక్ కు ఎనభై కోట్లు
రాజమౌళి, సునీల్ కాంబినేషన్ లో వచ్చి హిట్టైన మర్యాద రామన్న చిత్రం హిందీలోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎస్.ఓ.ఎస్ (సన్ ఆఫ్ సర్ధార్) తో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఇప్పటికే ఎనభై కోట్ల వరకూ బిజినెస్ ఆఫర్ వచ్చిందని, సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే ఈ రేంజి బిజినెస్ కావటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దీనికి కారణం అజయ్ దేవగన్ రీసెంట్ చిత్రం సింగం అని చెప్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఎఫెక్ట్ మర్యాద రామన్న రీమేక్ పై పడింది. ఆ చిత్రాన్ని అజయ్ దేవగన్ తో అతిధి తుమ్ కబ్ జావోగి అనే కామిడీ చిత్రం రూపొందించిన అశ్విని ధిర్ డైరక్ట్ చేస్తున్నాడు. అయితే హిందికి తగినట్లు కొన్ని మార్పులు చేస్తున్నట్లు చెప్తున్నారు. హీరోయిన్ ని ఎంపిక చేసి షూటింగ్ ప్రారంభిస్తామంటున్నారు.


Click it and Unblock the Notifications











