»   » ‘మసాలా’ ఆడియో డైరెక్టుగా మార్కెట్లోకి!

‘మసాలా’ ఆడియో డైరెక్టుగా మార్కెట్లోకి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వెంకటేష్‌, రామ్‌ హీరోలుగా బాలీవుడ్‌లో విజయం సాధించిన 'బోల్‌ బచ్చన్‌'కి రీమేక్‌గా ఓ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అంజలి, షాజన్‌ పదమ్‌సీ హీరోయిన్స్. విజయ్‌భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రానికి 'మసాలా' అనే టైటిల్ ఖరారు చేసి రీసెంట్ గా ఫ స్ట్ లుక్ ని విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

ఈ చిత్రం ఆడియో అక్టోబర్ 13న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో గ్రాండ్‌గా ఫంక్షన్ నిర్వహించి విడుదల చేద్దామని ముందు అనుకున్నప్పటికీ......పరిస్థితులు అనుకూలించని కారణంగా డైరెక్టుగా ఆడియో సీడీలను మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నెలలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి వినోదాత్మక చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మల్టీ స్టారర్ చిత్రం కావడం వలన ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

ఈ చిత్రంలో అంజలి, షాజన్‌పదమ్‌సీ హీరోయిన్స్. అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్ కాంబినేషన్‌లో రూపొంది, హిందీలో ఘనవిజయం సాధించిన 'బోల్ బచ్చన్'కి ఇది రీమేక్. ఈ చిత్రానికి కెమెరా: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, పాటలు: రామజోగయ్యశాస్త్రి.

English summary
Venkatesh, Ram's mult-starrer film 'Masala' audio will be release directly into stores on october 13.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu