»   » రామ్ ‘మసాలా’ విడుదల తేదీ

రామ్ ‘మసాలా’ విడుదల తేదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :వెంకటేష్, రామ్‌ల తొలి కాంబినేషన్‌లో భారీ ఎత్తున రూపొందుతోన్న చిత్రానికి ఇప్పటికే పలు టైటిళ్లు ప్రచారంలోకి వచ్చాయి. చివరకు 'మసాలా' టైటిల్ ఓకే చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం అక్టోబర్ 31 న విడుదలచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కె.విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో డి.సురేష్‌బాబు సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి. ఎస్.ఎస్.థమన్ స్వరపరిచిన పాటలను విజయ దశమికి విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. గతంలో రామ్ ట్వీట్ లో... కంటెంట్ రెడీ అయ్యాక కంట్రోలు చేసుకోవడం చాలా కష్టం....మా సినిమాని మీ ముందుకు ఎప్పుడెప్పుడు తీసుకువస్తానా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను...ఆడియో,సినిమా రిలీజ్ లు ఎప్పుడు అని అడిగుతున్నారు. మేము అంతా రెడీ అయిపోయాము... స్టేట్ లో ఇష్యూలు సెటిల్ అయితే మాకు క్లారిటీ వస్తుంది... అన్నారు. తుఫాన్ పెద్ద గొడవలు లేకుండా విడుదల అవటంతో అందరూ ధైర్యం చేస్తున్నారు.

ఇందులో అంజలి, షాజన్‌పదమ్‌సీ హీరోయిన్స్. అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్ కాంబినేషన్‌లో రూపొంది, హిందీలో ఘనవిజయం సాధించిన 'బోల్ బచ్చన్'కి ఇది రీమేక్. ఈ చిత్రానికి కెమెరా: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, పాటలు: రామజోగయ్యశాస్త్రి.

English summary
The makers of Victory Venkatesh and Ram starer Masala has come up with their release plans. They are planning to release their movie on October 31st. The shooting of the movie is complete and the makers are busy overseeing the post production activity. It is already known that the movie is the Telugu remake of Bollywood film, Bol Bachchan. K.Vijay Bhaskar is the director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu