twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయ్యో..! రానా థియేటర్ కాలిపోయింది: నేనే రాజు... తో ప్రారంభం కావాల్సిందే

    ప్రకాశం జిల్లా చీరాలలో దివంగత దగ్గుబాటి రామానాయుడు కుటుంబానికి చెందిన ఈ సినిమా హాల్‌ మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది

    |

    ప్రకాశం జిల్లా చీరాలలోని ప్రముఖ థియేటర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ పట్టణంలో ఇప్పటికీ టూరింగ్ టాకీసులే ఉన్నాయి. దీంతో చర్చ్ రోడ్ లోని తమ ధియేటర్ 'సురేశ్ మహల్'ను సరికొత్త హంగులతో ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్‌ దగ్గుబాటి రామానాయుడు కుటుంబం తీర్చిదిద్దింది. ఈ థియేటర్ ఎన్నో ఏళ్లుగా చీరాల వాసులకు వినోదాన్ని పంచుతోంది. అయితే ఆధునిక సౌకర్యాలు పెరిగినా చీరాల థియేటర్లకు మాత్రం మోక్షం రాలేదు.

    అత్యాధునిక టెక్నాలజీతో

    అత్యాధునిక టెక్నాలజీతో

    దివంగత దగ్గుబాటి రామానాయుడు కుటుంబానికి చెందిన ఈ సినిమా హాల్‌ను మరమ్మతులు చేసి రెండు థియేటర్లుగా అత్యాధునిక టెక్నాలజీతో తీర్చిదిద్దారు. ఒక థియేటర్‌ పూర్తి కావడంతో రేపు రామానాయుడు మనవడు, సినీ హీరో రానా చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు.

    Recommended Video

    Nene Raju Nene Mantri Review
    మంటలు చెలరేగాయి

    మంటలు చెలరేగాయి

    అయితే ఏసీలు బిగించే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే హాల్‌ మొత్తానికి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో కోటి రూపాయల మేర ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం.

    నాలుగు థియేటర్లు రెడీ

    నాలుగు థియేటర్లు రెడీ

    తన స్వస్థలం చీరాలలో సురేష్ మహల్ థియేటర్ ను మొత్తం ఈమధ్య పూర్తిగా పునరుద్దరించారు. ఇదే కాదు ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు థియేటర్లు రెడీ చేసారు.సురేష్ మూవీస్ తరపున ఆయన ఇటీవల తన లీజు థియేటర్ల సంఖ్య గణనీయంగా పెంచుకునే వ్యూహం లో భాగంగానే ఈ థియేటర్లను సిద్దం చేస్తున్నారు.

    నేనే రాజు నేనే మంత్రి

    నేనే రాజు నేనే మంత్రి

    ఈ థియేటర్లు అన్నింటినీ కొత్తగా మార్చి ఈరోజు విడుదల అవుతున్న ‘నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మళ్ళీ ధియేటర్స్ ఓపెన్ చేస్తున్నారు. అయితే అనుకోకుండా చీరాల సురేష్ మహల్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి మొత్తం చేసిన వర్క్ అంతా బూడిదపాలైపోయిన నేపధ్యంలో కోటి వరకు నష్టం వాటిల్లింది అన్న వార్తలు వస్తున్నాయి.

    దురదృష్టకర సంఘటన

    దురదృష్టకర సంఘటన

    వాస్తవానికి ఇన్సూరెన్స్ ఉన్నా తాను ఎంతో భారీ అంచనాలతో విడుదల చేస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి' సినిమా విడుదలకు ముందు ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం సురేశ్ బాబుకు షాక్ ఇచ్చింది అని టాక్. దీనితో కొంత వరకు ఈ నిర్మాత కొంత బెంగలో ఉన్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి

    English summary
    In a tragic incident, a fire broke out at Producer, distributor,exhibitor and Studio owner Suresh Babu’s Suresh Mahal Theatre in Chirala due to a short circuit on Thursday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X