»   » మే మొదటి వారంలో వస్తున్న సాయి ధరమ్ తేజ్

మే మొదటి వారంలో వస్తున్న సాయి ధరమ్ తేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా, బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా, 'పటాస్' సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతోన్న చిత్రం 'సుప్రీమ్'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణ లో , శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం మే మొదటి వారం లో భారీ విడుదలకు సిద్ధం అవుతోంది.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం పై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాల తరువాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తో సాయి ధరమ్ తేజ్ చేస్తోన్న మూడవ చిత్రం ఇది.

"సుప్రీమ్ అందరినీ అలరించే ఒక మాస్ ఎంటర్టైనర్.వేసవి సెలవుల్లో కుటుంబ సమేతం గా చూసి ఎంజాయ్ చేసే చిత్రం. మే మొదటి వారం లో భారీ విడుదల చేస్తున్నాం. ఇటీవలే విడుదల చేసిన ఆడియో కు మంచి స్పందన వస్తోంది . సాయి కార్తీక్ అందించిన పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి ", అని శిరీష్ అన్నారు.

 May 1st Week Release for Sai Dharam Tej - Anil Ravipudi's Supreme

దర్శకులు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, "మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక మాస్ చిత్రం ఇది. ఏక్షన్ , కామెడీ ,రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ సమపాళ్ళలో ఉండే చిత్రం ఇది. సాయి ధరమ్ తేజ్ డాన్స్ అండ్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది", అన్నారు.

సాయి ధరమ్ తేజ్ , రాశీ ఖన్నా, రాజేంద్ర ప్రసాద్, రవి కిషన్, సాయి కుమార్, పోసాని కృష్ణ మురళి , శ్రీనివాస్ రెడ్డి, మురళీ మోహన్ , రఘు బాబు, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు

దర్శకత్వం - స్క్రీన్ప్లే - అనిల్ రావిపూడి. రచనా సహకారం - సాయి కృష్ణ. సినిమాటోగ్రఫీ - సాయి శ్రీరామ్ . ఆర్ట్ - ఏ .ఎస్ ప్రకాష్ - ఎడిటర్ - ఎమ్ అర్ వర్మ . సంగీతం - సాయి కార్తీక్ . నిర్మాత - శిరీష్ . సమర్పకులు - దిల్ రాజు

English summary
'Supreme' Hero Sai Dharam Tej and Anil Ravipudi's 'Supreme' is going to have a grand release in the first week of May. Sai Dharam Tej and Rashi Khanna will be seen in lead roles and this is Anil Ravipudi's second film,his debut film being the super hit 'Pataas'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu