»   » మార్చి 31న మహేష్ ఫ్యాన్స్ కు ఆ రెండూ

మార్చి 31న మహేష్ ఫ్యాన్స్ కు ఆ రెండూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మార్చి 31 తేదీ ఘట్టమనేని అభిమానులకు ఎప్పుడూ పండుగే. ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. అదే రోజుని కృష్ణ గారి కుమారుడు కూడా తన చిత్రాల టీజర్స్ రిలీజ్ చేస్తూ స్పెషల్ డే గా మారుస్తూ వస్తున్నారు. గతంలో దూకుడు, వన్ నేనొక్కడినే చిత్రాల టీజర్స్ అదే రోజున విడుదల చేసారు. ఇప్పుడు కూడా దాన్నే అనుసరించి తన అభిమానులను ఆనందపరచనున్నారు మహేష్. అయితే ఈసారి ఈ 31 రెండు స్పెషల్స్ తో అలరించనుంది.

మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'శ్రీమంతుడు' చిత్రం టీజర్ అదే రోజు విడుదల చేస్తారు. అలాగే...శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందనున్న 'బ్రహ్మోత్సవం' చిత్రం పూజ కూడా అదే రోజున జరగనుంది. ఆ రోజున పూర్తిగా తన అభిమానులను ఆనందపరచాలని మహేష్ భావిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

May 31 st specials for Mahesh fans

మహేష్‌బాబు కంటిన్యూగా మూడు నెలలు పాటు అంటే 90 రోజుల పాటు కాల్ షీట్స్ ని శ్రీకాంత్ అడ్డాల చిత్రం కోసం ఎలాట్ చేసినట్లు సమచారం. తూర్పు గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో కథ జరుగుతుందని, అక్కడ కొన్ని సీన్స్ తీస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. ‘బ్రహ్మోత్సవం' సినిమా ప్రారంభానికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. దర్శకుడు ఇప్పటికే స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసి ఓ వెర్షన్ వినిపించి గ్రీన్ సిగ్నల్ పొందాడని తెలుస్తోంది.

గతంలో మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్‌లో ‘బ్రహ్మోత్సవం' రూపొందుతూండటంతో బిజినెస్ కూడా బాగా జరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

అయితే పి.వి.పి సంస్థ ఈ సినిమా కోసం కాస్టింగ్‌ కాల్‌ ఇచ్చింది. ఈ చిత్రంలో నటించడానికి 15 నుంచి 50 సంవత్సరాల వయస్సులోపు మేల్‌, ఫీమేల్‌ ఆర్టిస్టులు కావాలని ప్రకటించారు. ఆసక్తి కలవారు ఫుల్ సైజ్, క్లోజప్ ఫోటోతో కాంటాక్ట్ చేయాల్సిందిగా ప్రకటించారు. పైన ఫొటోలో ఉన్న మెయిల్ ఐ.డికి ఫోటోలు పంపించవచ్చు. ఈ సినిమా మహేష్ బాబుతోనే అయితే... తనతో తెరపంచుకునే అవకాశం కొత్త వారికి కలుగుతుంది.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం'. పివిపి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

‘బ్రహ్మోత్సవం'లో మహేష్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. వాటిని చిత్ర బృందం ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమాలో రావు రమేష్ కీలక పాత్రలో నటించనున్నారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

English summary
Much awaited teaser of Srimanthudu will be unveiled on Mahesh father birthday i.e on May 31 st.. Another news is that Mahesh's next project 'Brahmotsavam' under Srikanth Addala direction will get its formal puja done on May 31.
Please Wait while comments are loading...