»   » హీరోకి నేషనల్ అవార్డ్ ఏమోకానీ అద్భుతమైన నటన చేశాడు...!

హీరోకి నేషనల్ అవార్డ్ ఏమోకానీ అద్భుతమైన నటన చేశాడు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగువాడైన తమిళ హీరో విశాల్ ఇంతకాలం యాక్షన్ సినిమాలతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి సినిమాల్లో నటుడిగా తన ప్రతిభ చాటుకునే అవకాశం లేకపోవడంతో విశాల్ కేవలం కండలు, ఫైట్లు నమ్ముకుని నెట్టుకొచ్చేశాడు. అయితే బాలా దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చేసరికి విశాల్ సంతోషం పట్టలేకపోయాడు...

తనలోని నటుడిని బాలా ఆవిష్కరించాడని విశాల్ చెబుతూ ఉంటే నటన గురించి ఇతను మాట్లాడుతున్నాడేంటి" అని నవ్వుకున్న జనమే నోళ్లు తెరిచేలా 'వాడు వీడు"లో అద్భుతమైన నటన కనబరిచాడు. సూర్య అతిథి పాత్ర పోషించిన ఈ చిత్రంలో సూర్య ఎదురుగా నవరసాలు అభినయించే సన్నివేశంలో అయితే విశాల్ నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. కేవలం ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే కాదు, అదే సమచయంలో క్యారెక్టర్ కి అనుగుణంగా మెల్లకన్ను కూడా పెట్టాల్సి ఉండగా, ఎక్కడా లోపం లేకుండా నటించాడు.

ఈ సినిమాతో విశాల్ కి నేషనల్ అవార్డ్ వచ్చేస్తుందని ప్రచారం జరుగుతోంది కానీ అంతటి అవకాశమయితే బాలా అతనికివ్వలేదు. కేవలం రెండు, మూడు సన్నివేశాలకే విశాల్ నటనని పరిమితం చేసి మిగతా అంతా అతనితో కోతులాట ఆడించాడు.

English summary
Vishal, who is an hero for the masses earlier have choosen the script where he comes as transgenders here with Squint eyes and he delivers his best. Can see his effort in each & every scene of the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu