»   » చిన్న సినిమా అనుకుంటే గట్టి పోటీనే ఇచ్చేలా ఉంది: మాయామాల్ థియేటర్లు పెరుగుతున్నాయ్

చిన్న సినిమా అనుకుంటే గట్టి పోటీనే ఇచ్చేలా ఉంది: మాయామాల్ థియేటర్లు పెరుగుతున్నాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో ఈ మధ్య హర్రర్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు తక్కువేమీ కాదు. ఈ జోనర్ లో వచ్చిన సినిమాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించగా, చాలా సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అయినా సరే కొత్త కొత్త కోణాల్లో హార్రర్ కాన్సెప్ట్ తో సినిమాలు వస్తూనే వున్నాయి. అలా హర్రర్ జోనర్ లో వచ్చిన మరో చిన్న బడ్జెట్ సినిమానే ఈ మాయా మాల్. తెలుగులో వచ్చిన రొటీన్ హర్రర్ సినిమాల దారిలో వచ్చిన ఈ సినిమా కూడా అన్ని సినిమాల మాదిరి ఎలాంటి కొత్తదనం లేకుండా హర్రర్ మూసలో వచ్చిందీ అన్న టాక్ ఉన్నా థియేటర్ల దగ్గర మాత్రం మరీ అంత దారుణం గా ఏమిలేదు.

ఇక నటీనటుల విషయంకి వస్తే వాళ్ళ పరిధి మేరకు అందరు భాగానే చేసారు ముఖ్యంగా ఇండశ్త్రీ కన్ను పడకుండా యంగ్ టాలెంట్ ఎలా పక్కనే ఉండిపోతుందో అనిపించే టాక్ ఈ సినిమాలో నటీ నటుల పై వచ్చే కామెంట్. నిజానికి నటన లో మంచి మార్కులే పడ్డాయి. కాకపోతే సినిమాలో విషయం లేనపుడు వారు మాత్రం చేయడానికి ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ మాయామాల్ పరిస్థితి కూడా అలాగే అయ్యింది. కానీ మూడు రోజుల్లో పరిస్థితి మెరుగు పడిందనే చెప్పాలి...


Mayamal is became Big hit for Small Budjet

Fidaa Movie May Create New Trend

నార్మల్ సినిమా అనిపించుకుంటూనే ఈ వారం బిగ్గెస్ట్ సినిమా అ ఫిదాకి కొంత పోటీగా నిలబడింది ఈ ఒక్క సినిమానే. మొదటి రెండు రోజుల్లోనే తన సత్తా ఏమిటో నిరూపించుకున్న మాయామాల్... ఈ ఆదివారం నుంచీ మరిన్ని థియేటర్లని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. హీరోగా దిలీప్ గా మొదటి చిత్రం అయిన ఉన్నంతలో భాగానే చేసాడు. ఇక షకలక శంకర్, తాగుబోతు రమేష్ తనదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేసారు.

Mayamal is became Big hit for Small Budjet

లవ్‌ అండ్‌ హర్రర్‌ కామెడి థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఓ మాల్‌లో ప్రధానాంశంగా సాగుతుంది. దిల్‌ రాజు బ్యానర్‌లో పనిచేసిన గోవింద్‌ లాలం కొత్త కథనంతో ఈ చిత్రాన్ని చక్కగా ఆసక్తికరంగా తెరకెక్కించారు. సాయికార్తీక్‌ అందించిన సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు పెద్ద ఎసెట్‌ అవుతుంది. ఇక దీక్షా పంత్, హ్యాపీ డేస్ ఫేమ్ సోనియా గత సినిమాలతో పోల్చుకుంటే అందంగా కనిపించి మెప్పించింది. అన్న టాక్ కూడా ఇప్పుడిప్పుడే బయటకు రావటం తో ఈ వారం మరింత క్రేజ్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి.


English summary
Continuing the trend of low budget films, yet another horror comedy which has hit the screens is Maya Mall.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu