»   » గుండెళ్ళో గుబులు పుట్టిస్తున్న‘రోబో’ ప్రభంజనానికి కారణం ఎవరంటే..

గుండెళ్ళో గుబులు పుట్టిస్తున్న‘రోబో’ ప్రభంజనానికి కారణం ఎవరంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

60 ఏళ్లు పైబడినా ఉరకలెత్తే ఉత్సాహంతో నేటి కుర్రకారు మదిలో డాషింగ్ హీరోగా దూసుకెళుతున్న సూపర్‌ స్టార్ రజినీకాంత్ తమిళ పరిశ్రమనే కాదు.. యావత్భారత సినీ పరిశ్రమను షేక్ చేస్తున్నాడు. రజినీ 'రోబో" దెబ్బకు బాలీవుడ్ హీరోలైన ఖాన్‌ లు సైతం దిమ్మతిరిగిపోతున్నారు. ఇక మన టాలీవుడ్ సినిమాలైతే రోబోను చూసి తమ చిత్రాల విడుదల తేదీలను వాయిదా వేసుకుంటూ వెనకడుగులు వేస్తున్నాయి. మహేష్ బాబు ఖలేజాకు రోబో చిత్రం సవాల్‌ గా నిలిచిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ 'రోబో" చిత్రానికి యునామినస్ గా విడుదలయిన రోజే హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమాకి హైప్ రావడానికి శంకర్, రజనీకాంత్ కాంబినేషన్ ఒక కారణమైతే మీడియా మరో కారణమని పరిశీలకులు అంటున్నారు. ఈ చిత్రం విడుదల ముందు మీడియా బాగా పబ్లిసిటి ఇచ్చినందువల్ల ప్రేక్షకులు కూడా 'రోబో" ను వీక్షించడానికి భారీ ఎత్తున తరలివస్తున్నారని ఆ రకంగా మీడియా కూడా ఈ సినిమా సక్సెస్ కు కీలక పాత్ర వహించిందని అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu