»   » వెంకటేష్ 'గణేష్‌' చిత్రం ప్రేరణతోనే ఆ అమ్మాయి...

వెంకటేష్ 'గణేష్‌' చిత్రం ప్రేరణతోనే ఆ అమ్మాయి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభుత్వాస్పత్రులలో అవకతవకలు, సౌకర్యాల లేమి వంటి అంశాలుపై తీసిన సూపర్‌ హిట్‌ తెలుగు సినిమా 'గణేష్‌' తాను నిజజీవితంలో ఎమ్‌సెట్‌లో మెడిసిన్‌ విభాగంలో అత్యుత్తమ స్థాయి (టాప్‌ ర్యాంక్‌) చేరేందుకు ప్రేరణగా నిలిచినట్లు విద్యార్ధిని రావినూతల లలిత తెలిపింది. తాను మెడిసెన్ ఎంచుకోవటానికి కారణం మీడియాకు తెలియచేస్తూ...తాను పదవ తరగతిలో ఉండగానే మెడిసిన్‌ చదవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అయితే మెడిసిన్‌ మాత్రమే ఖచ్చింతంగా ఎంచుకోవటానికి కారణం 'గణేష్‌' చిత్రం అనీ, అది తనపై చాలా ప్రభావం చూపిందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సౌకర్యాలు ఎలాగుంటాయో ఇందులో చూపించారు. అక్కడ జరిగే అవినీతి, అవకతవకలను చూపెట్టారని అది తనను డాక్టర్ కావాలన్న దిశలో ప్రేరేపించిందని తెలిపింది. అలాగే తాను న్యూరాలజిస్టు కావాలనుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక వెంకటేష్ నటించిన గణేష్ చిత్రం తిరుపతి స్వామి దర్ళకత్వంలో రూపొందింది. 1998లో రిలీజైన ఈ చిత్రాన్ని సురేష్ బాబు తమ సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ పై నిర్మించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu