»   » ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ట్రైలర్ లాంచ్

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ట్రైలర్ లాంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌టైగర్‌'వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌, ఇ.సత్తిబాబు కాంబినేషన్‌లో నవీన్‌చంద్ర హీరోగా నిర్మిస్తున్న చిత్రానికి 'మీలో ఎవరు కోటీశ్వరుడుస‌. శృతిసోధి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది.

దర్శకుడు ఇ.సత్తిబాబు మాట్లాడుతూ - మీలో ఎవరు కోటీశ్వరుడు ఒక్క ఐడియా కోటి రూపాయలు. ట్యాగ్‌లైన్‌లో చెప్పినట్లు ఒక్క ఐడియాకే కోటి రూపాయలు ఇస్తున్నారంటే కారణమేంటి, దాని వెనుక కథేంటి అనేదే సినిమా. ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. నవీన్‌చంద్ర, శృతిసోధిలతో పాటు పృథ్వి కీలకపాత్రలో నటిస్తున్నారు. సినిమా దాదాపు పూర్తయ్యింది. ఈ నెల 5,6,7 వతేదిల్లో పృథ్వి, కల్యాణిలపై ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తాం. దాంతో మొత్తం సినిమా పూర్తవుతుందన్నారు.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

డబ్బింగ్‌ పూర్తయ్యింది. రీరికార్డింగ్‌ జరుగుతుంది. అక్టోబర్‌ 3వారం సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేశామని దర్శకుడు సత్తిబాబు తెలిపారు.

నవీన్ చంద్ర

నవీన్ చంద్ర

నవీన్‌చంద్ర మాట్లాడుతూ - ''రాధామోహన్‌గారు నాతో కామెడి జోనర్‌ మూవీ చేస్తాననగానే నేను లవ్‌, యాక్షన్‌ సినిమాలే చేశాను. కామెడి సినిమాలు చేయలేదని చెప్పాను. ఆయన సత్తిబాబుగారిని కలవమన్నారు. ఆయన్ను కలిసి కథ విన్నాను, నచ్చడంతో చేయడానికి అంగీకరించాను. ఈ సినిమాలో నేనా, పృథ్విగారా హీరో అని తేల్చుకోవాల్సి ఉంది. శృతి వంటి డేడికేటెడ్‌ హీరోయిన్‌ ఈ సినిమాలో వర్క్‌ చేశాను. ఈ సినిమా ట్యాగ్‌లైన్‌ ఒక ఐడియా కోటి రూపాయలు. కోటి రూపాయలు అంటే డబ్బు కాదు, కోటి రూపాయల ఆనందాన్నిచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.

నటీనటులు

నటీనటులు

నవీన్‌చంద్ర, శృతి సోధి, పృథ్వీ, సలోని, జయప్రకాష్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్‌, పిల్లా ప్రసాద్‌, గిరి, సన, విద్యుల్లేఖా రామన్‌, మీనా, నేహాంత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు అన్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్‌, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., కథ, మాటలు: నాగేంద్రకుమార్‌ వేపూరి, కథా విస్తరణ: విక్రవమ్‌రాజ్‌, డైలాగ్స్‌ డెవలప్‌మెంట్‌: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎడిటింగ్‌: గౌతమ్‌రాజు, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎం.ఎస్‌.కుమార్‌, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

English summary
Meelo Evaru Koteeswarudu Movie Press meet held at Prasad Labs in Hyderabad today (03rd Oct) evening.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu