»   »  మీరాజాస్మిన్ మరో సినిమా

మీరాజాస్మిన్ మరో సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Meera Jasmine
రాజ్ కంబైన్స్ బ్యానర్‌పై పి.ప్రభాకర్ దర్శకత్వంలో 'ఒకటి నాలుగు' అనే విచిత్ర మైన టైటిల్ తో ఓ చిత్రం రూపొందబోతోంది.దీంట్లో మళయాళీ కుట్టి మీరాజాస్మిన్ ప్రధాన పాత్ర పోషంచబోతోంది.ఈ కొత్త చిత్రం పాటల రికార్డింగ్ ఈ రోజు ఉదయం 7.20 నిమిషాలకు ప్రారంభమైంది.సంగీత దర్శకుడు అగస్త్య 'ఓనమ్' పండుగకు సంబంధించిన రామ జోగయ్య శాస్త్రి రాసిన పాటను తొలిపాటగా రికార్డ్ చేశారు.ఈ సినిమా ద్వారా నలుగురు కొత్త హీరోలు పరిచయం అవుతున్నారు.ప్రస్తుతం మీరాజాస్మిన్ 'గోరింటాకు' చిత్రంలో నటిస్తోంది.అలాగే షూటింగ్ పూర్తి చేసుకున్న 'మా ఆయన చంటి పిల్లాడు 'సినిమా కూడా రిలీజుకు సిద్దంగా ఉంది.ఈ వరస చూస్తుంటే ఈ యేడాది లో ఆమె తెలుగులో ఫుల్ బిజీగా ఉండేటట్లు ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X