»   » మీరాజాస్మిన్ 'మోక్ష' ఎంతవరకూ వచ్చింది

మీరాజాస్మిన్ 'మోక్ష' ఎంతవరకూ వచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

మీరాజాస్మిన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'మోక్ష' చిత్రం రామోజీ ఫిల్మ్‌సిటీలో 80 శాతం షూటింగ్‌ను పూర్తి చేశారు. క్లైమాక్స్ సన్నివేశాలను, పాటలను బ్యాలన్స్ ఉంది. వాటిని చెన్నైలో చిత్రించాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ వేములపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన అంతకు ముందు రాజీవ్ కనకాల హీరోగా బ్లాక్ అండ్ వైట్ అనే సస్పెన్స్ చిత్రాన్ని రూపొందించి ప్రసంశలు పొందారు. ఇక ఈ 'మోక్ష' చిత్రం ఓ హర్రర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో దిశ పాండే మరో హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ చిత్రం గురించి నిర్మాత పి.అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ...మీరాజాస్మిన్‌ గతంలో పలు పాత్రల్లో నటించారు. ఆమెకిది భిన్నమైన చిత్రం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, భయపెట్టేలా ఉంటుందీ చిత్రం. దిశ పాత్ర తప్పకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది అన్నారు. అలాగే దర్శకుడు మాట్లాడుతూ...ఆసక్తికరమైన కథ, కథనాలుంటాయి. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉన్న చిత్రంగా మలుస్తున్నామని చెప్పుకొచ్చారు. రాజీవ్‌ మోహన్‌ హీరోగా చేస్తున్ ఈ చిత్రం కథ మీరా జాస్మిన్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. అలాగే ఈ చిత్రం మిగతా పాత్రల్లో నాజర్‌, రాహుల్‌ దేవ్‌, సన, వహీదా, కాదల్‌ సుకుమార్‌, విజయభాస్కర్‌ కనిపిస్తారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu