»   » ఎక్స్ పోజింగ్ అంటే అదే!

ఎక్స్ పోజింగ్ అంటే అదే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మల్లేపూవ్వును తన పేరులో పెట్టుకున్న మీరా జాస్మిస్..ఈ మధ్య సినిమాలను తగ్గించుకుంది అనుకుంటున్నారు? అసలు ఆమెకు సినిమా అవకాశాలే రావడం లేదనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరబాటే అవుతుంది. ఎందుకంటే సినిమా సినిమాకీ మధ్య చాలా గ్యాప్ కావాలని అప్పట్లో మీరా చెప్పిన విషయం గుర్తింది కదా! అందుకే కొంచెం గ్యాప్ ఎక్కువగా తీసుకుంటుందట.

ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం ఆకాశరామన్న ఈ చిత్రం కాక మరో చిత్రంలో కూడా నటిస్తుంది. అది మీరా కెరీర్ ను మార్చేస్తుందట..ఇంతకీ ఆ చిత్రం ఏమిటనుకుంటున్నారు. లేడీ ఓరియంటెడ్ చిత్రం 'మోక్ష". ఇంతకీ ముద్దుగా, బొద్దుగా ఉండే ఈ భామ గ్లామర్ వెనుక రహస్యం ఏమిటో తెలుసా? అసలు గ్లామర్ అనే పదానికి అర్దం తెలుసా? తెలియక పోతే ఈ జాస్మిన్ చెబుతుంది తెలుసుకోండి.

మనకు సౌకర్యముగా ఉండే దుస్తులు వేయడమే గ్లామర్..అవతలి వారి కోసం దుస్తులు వేసుకుంటే అది గ్లామర్ కాదు.ఎక్స్ ఫోజింగ్..జీన్స్, షర్ట్స్, చీర, పంజావీ, చుడీదార్స్, లంగా ఓణీ..ఇలా ఏవి ధరించినా గ్లామర్ గానే కనిపిస్తారు. వీటన్నింటిని వేసి నేను కూడా గ్లామర్ ను ప్రదర్శించాను అని గ్లామర్ గురించి దంచేస్తుంది ఈ మల్లెపూవ్వు, అంతే కాదు ఈ ముద్దుగుమ్మకు ప్రశాంతమైన కుటుంబ జీవితం గడపడం అంటే ఎంతో ఇష్టమట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu