»   »  వాళ్లాయన చంటి పిల్లాడుట పాపం!?!?

వాళ్లాయన చంటి పిల్లాడుట పాపం!?!?

Posted By:
Subscribe to Filmibeat Telugu
వాళ్లాయన చంటి పిల్లాడుట పాపం. అందుకే వ్యవహారాలన్నీ ఆమె చూస్తుందిట. ఇంటా బయట వ్యవహారాలు చక్కబెడుతుందిట. ఈ వ్యవహారాలు చూసేది మీరా జాస్మిన్ అయితే చంటి పిల్లాడు శివాజీట. తమిళంలో విజయవంతమైన ఎన్ పరుషన్ కొలందుమాదిరి అనే సినిమా ఆధారంగా లక్కీ మీడియా తెలుగులో నిర్మిస్తున్న సినిమాయే మా ఆయన చంటి పిల్లాడు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. టైటిల్ ప్రకటన కోసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వన్నెంరెడ్డి మాట్లాడుతూ...భర్తను చంటి పిల్లాడని భావించి భార్య అన్ని సపర్యలు చేస్తుంది, వినోదాత్మకంగా సాగే కుటుంబ కథా చిత్రమిది.. క్షేమంగా వెళ్లి లాభంగా రండి లాగా ఈ సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది...అన్నారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ..రెండు పాటలు, ఒక ఫైట్ బ్యాలెన్స్ గా ఉంది, డిసెంబర్ లో జరిగే షూటింగ్ చిత్ర నిర్మాణం పూర్తవుతుంది... ప్రస్తుతం డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి...జనవరి నెలాఖరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము...అన్నారు. ఈ సినిమాలో మీరా జాస్మిన్, సంగీత హీరోయిన్లుగా నటిస్తుండగా శివాజీ హీరోగా చేస్తున్నారు... శ్రీలేఖ సంగీతాన్ని అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X