»   »  మీరా జాస్మిన్ పై బ్యాన్ కొనసాగుతోందా?

మీరా జాస్మిన్ పై బ్యాన్ కొనసాగుతోందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Meera Jasmine
నేషనల్ అవార్డు గ్రహీత మీరాజాస్మిన్ పై ఆ మధ్య మళయాళ చిత్ర పరిశ్రమ బ్యాన్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ బ్యాన్ అఫీషయల్ గా లేకపోయినా ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవటంతో మీరాని ఎవాయిడ్ చేసినట్లయింది. దాంతో మాతృ భాషని వదిలి ఆమె తెలుగు,తమిళ,కన్నడ పరిశ్రమలపై ఆధారపడాల్సి వస్తోంది. అసలు ఈ వివాదం AMMA (మళయాళం మూవీ ఆర్టిస్టులు అసోషియోషన్) ఫండ్స్ రైజ్ చేయటానికి 'ట్వంటి 20' అనే సినిమా ప్రారంభించటంతో మొదలైంది.

ఈ సినిమాలో దాదాపు 67 మంది సీనియర్ ,జూనియర్ ఆర్టిస్టులు భేద భావం లేకుండా ఉచితంగా చేస్తున్నారు. ఆ క్రమంలో మీరాని అక్కడి స్టార్ దిలీప్ వచ్చి నటించమని అడిగితే ఆమె డేట్స్ ఖాళీగా లేవని చెప్పి తిరస్కరించింది. అయితే మీరా ఆ తర్వాత Minnaminnikoottam అనే సినిమాకు బల్క్ గా డేట్స్ ఇచ్చింది. విషయం తెలుసుకున్న అక్కడి పరిశ్రమ ఆమెది ఏటిట్యూడ్ ప్లాబ్లమ్ గా పరిగణించి అనధికారికంగా బ్యాన్ పెట్టారు. షొ కాజ్ నోటీస్ పంపారు.

అయినా మీరా బెదరక దాంతో ఆమె మిగతా పరిశ్రమలపై కాన్సర్టేషన్ చేసింది. ఆ తర్వాత ఆమెకు అక్కడనుండి ఆఫర్స్ ఏమీ రాలేదు. ప్రస్తుతం ఆడ్ ల్యాబ్స్ వారు కన్నడంలో పేరున్న ఆఫ్ బీట్ డైరక్టర్ ఎమ్.ఎస్.సత్య దర్శకత్వంలో నిర్మిస్తున్న Ijjodu చిత్రాన్ని కమిట్ అయింది. ఈ సినిమాలో ఆమె దేవదాసి గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమే స్వయంగా డబ్బింగ్ చెప్పాలనే కండీషన్ పై ఆమె డేట్స్ తీసుకున్నారు.

ఇక తెలుగులో శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రెడీ అవుతున్న 'అఆఇఈ' అనే సినిమాలో శ్రీకాంత్ సరసన చేస్తోంది. అలాగా తమిళంలో ఆమె భరత్ సరసన చేసిన 'నేపాలి' సినిమా కాంట్రావర్శి అయి హిట్ టాక్ తెచ్చుకోవటంతో అక్కడ నుండి ఆఫర్స్ వస్తున్నాయి. దాంతో ఆమెకు అక్కడ బ్యాన్ ఉంటేనేం ఆఫర్స్ కి కొదవలేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో నటించిన 'గోరింటాకు','మా ఆయన చంటి పిల్లాడు' చిత్రాలు ఈ నెలలో రిలీజయ్యాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X