»   » సూపర్ ఛాన్స్ :మహేష్,శ్రుతిలను సీక్రెట్ గా కలవండి

సూపర్ ఛాన్స్ :మహేష్,శ్రుతిలను సీక్రెట్ గా కలవండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మీ అభిమాన హీరో మహేష్ ని, హీరోయిన్ శ్రుతి హాసన్ ని కలవాలని ఉందా...అయితే మరెందుకు ఆలస్యం ఈ క్రింద రాసింది చదివేసి ప్రొసీడైపోండి. ఈ రోజు (జూలై 31) ని మహేష్, శ్రుతి లను కలిసే సీక్రెట్ ఆఫర్ ని ఊబర్ క్యాబ్ వారు అందిస్తున్నారు. అందుకు మీరేం చేయాలంటే..

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ రోజు ..మీరు వీరి క్యాబ్ కు సంభందించిన యాప్ ని డౌన్ లోడ్ చేయాలి. అందులో ప్రీ బిల్డ్ గా ఉన్న శ్రీమంతుడు ఆప్షన్ ని క్లిక్ చేయాలి. అప్పుడు అందులో 15 మంది వద్దకు వారి కంపెనీ వారు క్యాబ్ వచ్చి ఆగి, తీసుకు వెళ్తుంది. తర్వాత మీరు అక్కడ మహేష్, శృతిలను కలవొచ్చు.


కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం 'శ్రీమంతుడు'. మహేష్‌బాబు హీరో. శ్రుతి హాసన్‌ హీరోయిన్. మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కించింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రం కృష్ణా జిల్లా రైట్స్ ని రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ తీసుకున్నట్లు ట్రైడ్ వర్గాల సమాచారం. అభిషేక్ పిక్చర్స్ వారు భాగస్వామ్యంగా ఉంటున్నారు. పోస్టర్ అండ్ పబ్లిసిటీతో కలిపి మూడు కోట్లుకు తీసుకున్నట్లు తెలుస్తోంది.


Meet Mahesh-Shruti At Secret Location!!

అలాగే...ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ మొత్తం 17 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. అందులో తెలుగుకు 12 కోట్లు, హిందీ శాటిలైట్ రైట్స్ 5 కోట్లు అని ట్రేడ్ వర్గాల సమాచారం. జీ తెలుగు వారు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు వినికిడి.


చిత్రం గురించి కొరటాల శివ మాట్లాడుతూ... అతను అపర శ్రీమంతుడు. ధనంలో... గుణంలోను. జీవుడల్లె పుట్టి.. ఆ వూరికి దేవుడల్లె వచ్చాడు. స్నేహానికి నిర్వచనంలా, త్యాగానికి చిరునామాలా కనిపిస్తాడు. ఇక అతని అందం గురించి ఏమని చెప్పాలి? అతని నవ్వు.. ప్రేమకు చిహ్నంలా ఆకర్షిస్తుంది.


కాముడు రాసిన గ్లామర్‌ డిక్షనరీలా చటుక్కున ఆకట్టుకొంటాడు. అలాంటి అబ్బాయిని ఏ అమ్మాయైనా ప్రేమించకుండా ఉంటుందా? ఓ అమ్మాయి కూడా మనసిచ్చేసింది. మరి ఆ ఇద్దరి వలపుల ప్రయాణం ఏ రీతిన సాగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కొరటాల శివ.


దర్శకుడు కొరటాల శివ కంటిన్యూ చేస్తూ.. ...''మహేష్‌ లాంటి ఓ గొప్ప నటుడితో సినిమా చేసే అవకాశం ఇంత తొందరగా రావడం నా అదృష్టం. మహేష్‌ ఇమేజ్‌కి నాలుగు ఫైట్లు, పాటలు ఉంటే సరిపోదు. ఒక పెద్ద కాన్వాస్‌లో కథ ఉండాలని కష్టపడి రాశా. మహేష్‌గారికి చెప్పినప్పుడు 'ఈ కథని ఇంత కమర్షియల్‌గా చెప్పొచ్చా?' అని ఆశ్చర్యపోయారు. మహేష్‌తో ఈ సినిమా తీయడం ఆనందంగా ఉంది. మహేష్‌, జగపతిబాబు తండ్రీకొడుకులుగా బాగా కుదిరారు''అన్నారు.


నిర్మాతలు నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ మాట్లాడుతూ ''ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. మాస్‌, క్లాస్‌ తేడా లేకుండా పాటలు అందరినీ ఆకట్టుకొంటున్నాయి. అభిమానుల అంచనాలను అందుకొనేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. మహేష్‌ నటించిన చిత్రాలు తమిళంలోనూ మంచి వసూళ్లు రాబట్టాయి. 'శ్రీమంతుడు'ని తమిళంలో 'సెల్వందన్‌' పేరుతో విడుదల చేస్తున్నాము''అన్నారు.


శ్రుతి హాసన్‌ మాట్లాడుతూ... ''ఇలాంటి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో మరిచిపోలేని పాత్ర పోషించాను''అన్నారు.


జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, ముఖేష్‌ రుషి, తులసి, సుకన్య తదితరులు నటించారు. పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం: మది

English summary
Popular cab operator Uber has launched a special offer for Mahesh and Shruti fans. All we need to do is use Uber app between 11.30 am and 1.30 pm tomorrow and select the pre-built option 'Srimanthudu'. A car will arrive for the 15 lucky winners and it will whisk them away to a secret location where they could meet Mahesh Babu and Shruti Haasan.
Please Wait while comments are loading...