»   » ఉయ్యాల వాడ పేరు మారింది... పవర్ ఫుల్ టైటిల్ ఇదే

ఉయ్యాల వాడ పేరు మారింది... పవర్ ఫుల్ టైటిల్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖైదీనెం 150 తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డేనా కాదా అన్న డైలమాలో చాలామందే ఉన్నారు. ఒకసారి కన్ ఫార్మ్ అనీ మరో సారి తూచ్..తూచ్..! వేరే మాస్ సినిమా అనీ ఏవేవో వార్తలు వినిపిస్తూ మరింత అయోమయానికి గురి చేసాయి. అయితే అన్ని అనుమానాలనూ పటాపంచలు చేస్తూ తన సినిమా పాలెగాడు ఉయ్యాలవాడ నరసిం‌హారెడ్డి కథే అని, మెగాస్టార్ 151 విషయం లో ఇదే పక్కా చేసుకోవచ్చనీ కన్‌ఫార్మ్ చేసేసాడు సురేందర్ రెడ్డి....

భారీ బడ్జెట్ తో

భారీ బడ్జెట్ తో

'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'ని తెరకెక్కించడానికి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. తొలికాలాలనాటి పోరాట యోధుడి చరిత్ర కావడంతో, భారీ బడ్జెట్ తో .. బహు భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Chiranjeevi 151 Movie Title Changed
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నా, లేదా ఉయ్యాలవాడ అన్నా కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం అయిపోతుంది. కానీ చిరు ఈ సినిమాను సౌత్ ప్లస్ హిందీ భాషల్లోకి భారీగా అందించాలని చూస్తున్నారు. అందువల్ల అన్ని భాషలకు సరిపడా టైటిల్ కోసం వెదికారు.

మహావీర

మహావీర

ఆఖరికి అన్ని భాషలకి సంబంధించి ఒకే టైటిల్ పెడితే బాగుంటుందనే ఆలోచన చేశారు. అలా ఈ సినిమాకి 'మహావీర' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా పేరు ‘మహావీర'.

బాహుబలి తర్వాత

బాహుబలి తర్వాత

బాహుబలి విజయం తర్వాత ఈ సినిమాని నేషనల్ లెవెల్ లో ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో బడ్జెట్ ని కూడా అమాంతం పెంచేశారు. దానికి తోడు ఈ మహావీర సినిమాని తన నాన్నకు చిరస్మరణీయ సినిమాగా మిగలాలని కంకణం కట్టుకున్న రామ్ చరణ్ దానికి తగ్గ ఏర్పాట్లలో ఉన్నాడు.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై

కథాపరంగా కూడా ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు భాషల్లోని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండడం కోసం టైటిల్‌ను మార్చాలని నిర్ణయించారట.

త్వరలోనే సెట్స్‌పైకి

త్వరలోనే సెట్స్‌పైకి

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. చిరు జన్మదినం కంటే ముందే స్వాతంత్ర్యదినోత్సవం రోజే షూటింగ్ ప్రారంభిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు మెగా స్టార్ ఇక ఈ సినిమా కూడా హిట్ కొడితే గనక చిరూ రెండో ఇన్నింగ్స్ కి తిరుగులేనట్టే...

English summary
the title will not find appeal in other languages as the makers are planning a pan-Indian release for the film. For that reason, Chiranjeevi and Co have now turned to another title and it happens to be "Mahaveera".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu