twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేనేంటో చూపిస్తా, నాకే ఎక్కువ హక్కు ఉంది, నా తమ్ముడు పులి: నాగబాబు

    |

    Recommended Video

    Pawan Kalyan About His Brother Nagababu | Janasena | Filmibeat Telugu

    'జనసేన' పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సోదరుడు నాగబాబును పార్టీలోకి ఆహ్వానించి నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి దించుకుతున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేసిన అనంతరం నాగబాబు ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు.

    నా తమ్ముడు నా కంటే చాలా చిన్నవాడు. నేను ఎత్తుకుని ఆడించేంత వయసు గ్యాప్ మా మధ్య ఉండేది. చిన్నతనంలో చాలా క్యూట్‌గా ముద్దుగా ఉండేవాడు. తనను ఏడిపించడం అపుడు సరదాగా ఉండేది. అలాంటి వ్యక్తి ఎదుగుతూ మేమంతా ఆశ్చర్యపోయే ఒక గ్రేట్ లీడర్ అయ్యాడని నాగబాబు తెలిపారు.

    దేశంలో అలాంటి లీడర్ ఉన్నాడా?

    దేశంలో అలాంటి లీడర్ ఉన్నాడా?

    దేశంలో తనలాంటి మంచి క్వాలిటీస్ ఉన్న లీడర్స్ ఉన్నారా? అని ఒక్కోసారి అనిపిస్తుంది. నా తమ్ముడు నాకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వడు. నా ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు. ఫోన్ ఎత్తితే ఏం మాట్లాడాల్సి వస్తుందో అని సంకోచించేవాడని నాగబాబు తెలిపారు.

    పార్టీలో ఇన్వాల్వ్ అవ్వకూడదను అనుకున్నాం

    పార్టీలో ఇన్వాల్వ్ అవ్వకూడదను అనుకున్నాం

    వాస్తవానికి కళ్యాణ్ బాబు పార్టీలో మా కుటుంబం నుంచి ఎవరూ ఇన్వాల్వ్ కాకూడదని అనుకున్నాం. నాకైతే రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలనే కోరిక ఉండేది. ప్రజారాజ్యం సమయంలో డిసప్పాయింట్ కావడంతో ఆ కోరికను వదిలేశాను. కళ్యాణ్ బాబు పార్టీ పెట్టిన తర్వాత మనసులో అనిపించినా తమ్ముడిని తమ్ముడిగానే చూద్దాం. నాయకుడిని నాయకుడిగానే చూద్దాం అని మనసులో అనుకున్నాను.

    నాకే ఎక్కువ హక్కు ఉంది

    నాకే ఎక్కువ హక్కు ఉంది

    తమ్ముడు అనే విషయం పక్కనపెడితే.... అన్నింటికంటే మించి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి మా తమ్ముడు. జనసేనలో ఉన్న చాలా మంది కన్నా నాకే ఈ విషయం చెప్పడానికి ఎక్కువ హక్కుంది. ఎందుకంటే మా తమ్ముడిని చిన్నప్పటి నుంచి చూశాను.

    పులిలా ఉండేవాడు

    పులిలా ఉండేవాడు

    చిన్నతనంలో ఒక రకమైన పులిలా ఉండేవాడు. ఎవరి జోలికి వెళ్లేవాడు కాదు. తన పని తాను చేసుకునే వాడు. ఒంటరిగా కూర్చునేవాడు. ఏం చేస్తున్నావ్ కళ్యాణ్ అంటే ఏమీ చెప్పేవాడు కాదు. తనలో ఇంత స్ట్రగుల్ ఉందని తర్వాత లెలిసింది.

    పార్టీలోకి రమ్మనగానే నమ్మలేదు, టెన్షన్ పడ్డా

    పార్టీలోకి రమ్మనగానే నమ్మలేదు, టెన్షన్ పడ్డా

    నన్ను పార్టీలోకి రమ్మని పిలిచిన తర్వాత నమ్మలేదు. ఆ తర్వాత టెన్షన్ పడ్డాను. నాకంటే చిన్నవాడు కాబట్టి పేరుకే తమ్ముడు. మీలాగే నాకూ ఆయన నాయకుడు పవన్ కళ్యాణ్.

    క్లీనింగ్ చేయడానికైనా సిద్ధం

    క్లీనింగ్ చేయడానికైనా సిద్ధం

    పార్టీలో చేరకముందే జనసేన అభిమానిగా నా నాయకుడు పవన్ కళ్యాణ్ కోసం ఏ పని చేయడానికికైనా సిద్ధంగా ఉన్నాను. ఆఫీసులో క్లీన్ చేయ్ అంటే చేయడానికి సిద్ధంగా ఉండేలా మెంటల్‌గా ప్రిపేర్ అయ్యాను. తమ్ముడి ఇన్స్‌స్పిరేషన్ తోనే ఇంతకాలం మాట్లాడుతూ వచ్చాను. ఇకపై నేనేంటో చూపిస్తానని నాగబాబు వ్యాఖ్యానించారు.

    English summary
    Mega Brother Naga Babu Speech at Janasena Party Office. Naga Babu, who is also the brother of Pawan Kalyan, is likely to contest from Narasapuram Lok Sabha seat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X