ఎన్టీఆర్ బయోపిక్‌లో నాగబాబు.. ప్రముఖ నటుడి పాత్రలో..
టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో స్టార్ నటీనటులు జాబితా రోజు రోజుకు పెరిగిపోతున్నది. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించేందుకు మెగా బ్రదర్ నాగబాబు రెడీ అయ్యాడు. ప్రఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నాగబాబు ఎస్వీ రంగారావు పాత్రలో నటిస్తున్నారు. గతంలో పలు చిత్రాల్లో పౌరాణిక పాత్రలను నాగబాబు పోషించిన సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్నాయన చిత్రంలో యముడిగా కనిపించారు.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న చిత్రాన్ని బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 9వ తేదీ సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుంది.
ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలకృష్ణ, విద్యా బాలన్, రానా, నందమూరి మోక్షజ్ఞ (నూతన పరిచయం ), కళ్యాణ్ రాం, భరత్‌రెడ్డి, సచిన్ ఖేడ్కర్, మంజిమా మోహన్, విక్టరీ వెంకటేష్, సుమంత్, అనుష్క, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, రవి కిషన్, కైకాల సత్యనారాయణ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











