»   » బాలకృష్ణని టార్గెట్ చేసుకున్న మెగా బ్రదర్స్....

బాలకృష్ణని టార్గెట్ చేసుకున్న మెగా బ్రదర్స్....

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా బ్రదర్స్ ఇద్దరూ కలిసి మరో టాప్ స్టార్ బాలయ్యని కార్నర్ చేస్తున్నారా..? ఈ సారి సంక్రాంతికి ఈ ముగ్గురు స్టార్ల సమరం తప్పదా.... ఒకవేళ ఈ ముగ్గురూ తలపడితే గెలుపెవరిది? ఈ సారి రాబోయే సంక్రాంతి సీనియర్ హీరోల మధ్య బాక్సాఫీసు యుద్దంలా మారే అవకాశం ఉంది అని అంటున్నారు సినీ జనాలు.

Balakrishna

బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' కి ఈ మధ్యనే ముహూర్తం కూడ జరిగిపోయి రెగ్యులర్ షూట్ కు రెడీ అవుతూ బాలకృష్ణకు బాగా కలిసి వచ్చే సంక్రాతిని టార్గెట్ చేస్తూ చిత్రీకరణ జరుపుకుంటోంది. డైరెక్టర్ క్రిష్ ఎట్టి పరిస్తుతులలోను ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక బాలయ్య అయితే ఈసినిమా కోసం తన వెయిట్ తగ్గడానికి ప్రొటీన్ షేక్, సలాడ్స్ తీసుకుంటూ ఫిట్ నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు.
Chiranjeevi

చిరంజీవి కుడా తన 150వ సినిమా 'కత్తిలాంటోడు'ను 29 న పూజా కార్యక్రమాలు చేసి మొదలు పెట్టి, జూన్ నుంచి నిర్విరామంగా షూటింగ్ చేసి అన్ని కుదిరితే తాను కూడ సంక్రాతి రేస్ కు రెడీ కావాలి అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి రీఎంట్రీని గ్రాండ్ లెవెల్‌లో చూపించేలా సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలుని భారీ పారితోషికం ఇచ్చి ఈసినిమాకు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

పవన్‌కల్యాణ్ విషయానికొస్తే ఎస్.జె. సూర్య డైరెక్షన్‌లో కొత్తమూవీ నిన్న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఈ సినిమాను కూడ సంక్రాతికి విడుదల చేసి 'సర్దార్' వల్ల వచ్చిన నష్టాన్ని పూడ్చాలని ప్రయత్నిస్తున్నాడు.

ఈ ముగ్గురు హీరో లూ సంక్రాంతికే తలడే పరిస్థితి వస్తే బాక్సాఫీసు పోరు మరింత రసవత్తరంగా మారనుంది.

English summary
Balakrishna, Chiranjeevi and Pavan kalyaan are planing to release their films at sankranthi
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu