»   » చరణ్ ఇంట్లో ‘మెగా చిరంజీవితం 150’లాంచ్, పుస్తకంలో ఏముంది, రేటెంత,ఎక్కడ దొరుకుతుంది

చరణ్ ఇంట్లో ‘మెగా చిరంజీవితం 150’లాంచ్, పుస్తకంలో ఏముంది, రేటెంత,ఎక్కడ దొరుకుతుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల ఆధారంగా పసుపులేటి రామారావు 'మెగా చిరంజీవితం 150' అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌లోని రాంచరణ్‌ నివాసంలో ఆవిష్కరించారు. దర్శకుడు వి.వి.వినాయక్‌ తొలి పుస్తకం అందుకొన్నారు.

దాదాపు తొమిదిన్నర సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి వెండితెర రీ ఎంట్రీ అదిరే స్దాయిలో జరిగింది. ఖైదీ నెం 150 సినిమాతో చిరు అందరి గుండెల్లో వైబ్రేషన్స్ పుట్టించేలా దుమ్ము రేపాడు. 60 ఏళ్ళ వయస్సులోను పాతికేళ్ళ కుర్రాడిలా ఎంతో ఉత్సాహంతో నటించిన మెగాస్టార్ బాస్ ఈజ్ బ్యాక్ అని నిరూపించాడు.

ప్రస్తుతం చిరు మేనియా పీక్ స్టేజ్ కి చేరింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లోకి చేరి ఔరా అనిపించింది. ఇక ఆ మధ్య చిరంజీవిపై ఓ బుక్ రూపొందించి విడుదల చేస్తారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రామ్ చరణ్, వివి వినాయక్, అల్లు అరవింద్ లు తాజాగా 'మెగా చిరంజీవితం' అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఈ పుస్తకం మన ముందుకు వచ్చింది.

తండ్రితో జ్ఞాపకాలు..

తండ్రితో జ్ఞాపకాలు..

రామ్ చరణ్ కంటిన్యూ చేస్తూ...‘పుస్తకంలోని ఫొటోలు చూసి గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాను. ఆ రోజుల్లో చేసిన అల్లరి గుర్తుకొచ్చింది. రామారావు కష్టపడి దీనిని రూపొందించారు.' అంటూ చిరుతో తనకున్న జ్ఞాపకాలనుగుర్తుచేసుకున్నారు. ‘ నేను కూడా చూడని ఎన్నో ఫొటోలు ఈ పుస్తకంలో ఉన్నాయి. దీనిని నా లైబ్రరీలో దాచుకుంటాను.' అని అన్నారు.

25 రోజుల్లోనే...

25 రోజుల్లోనే...

అల్లు అరవింద్ మమాట్లాడుతూ...గతంలో చిరంజీవిపై ఓ పుస్తకాన్ని రాశారు. ఈసారి 150వ సినిమా సందర్భంగా చిరంజీవిపై రాస్తానని పసుపులేటి అన్నారు. ఎటువంటి సాయం కావాలన్నా చేస్తానని అన్నాను. కేవలం 25 రోజుల్లో పుస్తకాన్ని తీర్చిదిద్దారు.

 అన్ని కోణాలను

అన్ని కోణాలను


ఈ పుస్తకాన్ని 'ఖైదీ నంబర్‌ 150' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లోనే విడుదల చేయాల్సింది కానీ కుదరలేదు. చిరంజీవి నట ప్రస్థానానికి సంబంధించి అన్ని కోణాలను రామారావు ఈ పుస్తకంలో పొందు పరిచి ఉంటారని భావిస్తున్నాను. మా ఫ్యామిలీ తరపున పసుపులేటి రామారావుకి ధన్యవాదాలు అని చెప్పారు అల్లు అరవింద్.

 పాత రోజులు గుర్తుకు వస్తూ..

పాత రోజులు గుర్తుకు వస్తూ..


దర్శకుడు వినాయిక్ మాట్లాడుతూ.. ''చిరంజీవిగారంటే పసుపులేటి రామారావుకి ఎంత అభిమానమో, పసుపులేటి రామారావుగారన్నా చిరంజీవికి అంతే అభిమానం. సీనియర్‌ జర్నలిస్ట్‌ రామారావు రాసిన ఈ పుస్తకం బాగుంది. ఈ పుస్తకంలోని కొన్ని ఫోటోలను చూస్తుంటే పాత రోజులు గుర్తుకు రావడమే కాదు, ఆ సినిమాల రిలీజ్‌ సమయంలో చేసిన అల్లరి గుర్తుకు వస్తుంది అన్నారు వినాయిక్.

ఈ వాక్యాన్ని

ఈ వాక్యాన్ని

ఈ పుస్తకంలో.. మెగా అంటే చిరంజీవి.. చిరంజీవి అంటే స్వయంకృషి అని రామారావు రాయడం ఎంతో సూపర్‌గా అనిపించింది. చిరంజీవిని రామారావు దగ్గర నుండి చూడటం వల్లనే ఆయన ఈ వాక్యాన్ని రాయగలిగారు. మా అందరి తరపున రామారావుగారికి థాంక్స్‌'' అన్నారు వివి వినాయిక్.

 సీనియర్ గా ..

సీనియర్ గా ..

నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతూ..''నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, అన్నయ్య 'కోతలరాయుడు' సినిమాకు పనిచేస్తున్నప్పుడు ఆ సినిమాకు రామారావు పి.ఆర్‌.ఒగా పనిచేశారు. అందరి జర్నలిస్టుల కంటే సీనియర్‌గా తనదైన శైలిలో రాణించారు. గౌరవానికే గౌరవమైన చిరంజీవిపై రామారావుగారు పుస్తకం రాయడం ఆనందంగా ఉంది. అందరూ ఇప్పుడు చిరంజీవిని చూసి బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటున్నారు కానీ, చిరంజీవి ఎప్పటికీ బాస్‌. చిరంజీవిపై వచ్చిన ఈ పుస్తకాన్ని పత్రి అభిమాని చదవాలి'' అన్నారు.

 నేను చూడనవి కూడా..

నేను చూడనవి కూడా..


''పసుపులేటి రామారావు నలబై ఏళ్ళకు పైగా జర్నలిస్ట్‌గా వర్క్‌ చేశారు. ఆయన అనుభవమంతా వయసు లేనివాడిని, ఆయన గురించి నేను ఏం మాట్లాడాలో తెలియలేదు. నేను చిన్నప్పటి నుండి తెలుగులో నెంబర్‌ వన్‌ జర్నలిస్ట్‌గా పసుపులేటి రామారావు పేరు వింటున్నాను. ఈ పుస్తకంలో నేను కూడా చూడని నా ఫోటోస్‌ను రామారావు సేకరించారు. ఈ పుస్తకం మా లైబ్రరీలో నెంబర్‌ వన్‌ బుక్‌ అవుతుంది. నాన్నగారు, మా కుటుంబం, అభిమానుల తరపున పసుపులేటి రామారావుగారికి థాంక్స్‌'' అన్నారు.

 నైతికంగా మద్దతు..

నైతికంగా మద్దతు..


పుస్తక రచయిత రామారావు మాట్లాడుతూ.. మెగా చిరంజీవితం 150 అనే టైటిల్‌ను ఈ పుస్తకానికి పెట్టడానికి ముందు చాలా ఆలోచించాం. చిరంజీవి పుస్తకానికి ఏ పేరు పెట్టాలా అని సీనియర్‌ జర్నలిస్ట్‌ వినాయకరావు, చిన్నారాయణతో చర్చించాను.. అయితే చివరకు నేను చిరంజీవిపై ముందు రాసిన మెగా చిరంజీవితం అనే టైటిల్‌ను పెడితే బావుంటుందనిపించి అరవింద్‌కి తెలియజేశాను. ఆయన కూడా నైతికంగా ఎంతో మద్ధతునిచ్చారు.

 చరణ్ బాబు చేతుల మీదుగా

చరణ్ బాబు చేతుల మీదుగా


నేను అడగ్గా నా కోసం ఈ పుస్తకం కోసం స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే చిరంజీవి కూడా ఓ స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే దాసరిని అడగ్గానే ఓ స్పెషల్‌ ఆర్టికల్‌ రాసిచ్చారు. నేను విశాలాంధ్రలో పనిచేస్తున్నప్పటి నుండి చిరంజీవితో అనుబంధం ఉంది. మీడియా అంటే చిరంజీవి ముందు నుండి అభిమానం చూపేవారు. అలాగే సినిమాల్లో ఆయన పడ్డ కష్టాన్ని నేను దగ్గర నుండి చూశాను. ఈ రోజు చరణ్‌బాబు చేతుల మీదుగా పుస్తకం రిలీజ్‌ కావడం ఎంతో ఆనందంగా ఉంది'' అన్నారు పుస్తక రచయత పసుపులేటి రామారావు.

టెక్నీషియన్స్ అనుభవాలు

టెక్నీషియన్స్ అనుభవాలు

ఈ పుస్తకంలో చిరు 150వ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ అనుభవాలతో పాటుగా చిరు ఇప్పటి వరకు నటించిన సినిమాలలోని నటీనటుల ఎక్స్ పీరియెన్స్ ని ఇందులో పొందుపరిచారట. పసుపులేటి రామారావు గారిన రాసిన ఈ పుస్తకం మార్కెట్ లోకి కూడా లభించనుంది.

 ఈ బుక్ లో ..

ఈ బుక్ లో ..


గ‌తంలో ఈ ర‌చ‌యిత చిరంజీవి పై ఓ పుస్త‌కాన్ని తీసుకువ‌చ్చారు. అయితే ఆ పుస్త‌కానికి పూర్తి భిన్నంగా 120 క‌ల‌ర్ పేజీల‌తో 220 బ్లాక్ & వైట్ పేజీల‌తో రంగుల వైభ‌వం అన్న‌ట్టుగా ఈ మెగా చిరంజీవితం 150 పుస్త‌కాన్ని తీసుకురావ‌డం విశేషం. బ్లాక్ అండ్ వైట్ పేజీలను అనేక ఫొటోలతో అందంగా అలంకరించారు. ప్రత్యేకంగా ఈ పుస్తకం చిరంజీవి ఇచ్చిన ఇంటర్వూ. అలాగే ఇంటర్వూలకు ఆమడ దూరంగా ఉండే అల్లు అరవింద్ ఇచ్చిన ఇంటర్వూ ఈ పుస్తకానికి హైలెట్స్. చదవగానే పూర్తి సంతృప్తి ఇచ్చే పుస్తకం ఇది.

 ఎక్కడ దొరుకుతుంది

ఎక్కడ దొరుకుతుంది


పుస్తకం రేటు 300 మాత్రమే. అన్ని ప్రధాన పుస్తకాల షాపులోనూ ఈ పుస్తకం దొరుకుతుందని చెప్తున్నారు. రచయిత సెల్ నెంబర్ 9392364031, లాండ్ లైన్ 040-23550311. చిరంజీవి న‌టించిన మొత్తం 150 చిత్రాల పోస్ట‌ర్ల‌ను పేజీకొక‌టి చొప్పున రంగుల‌లోనే ముద్రించ‌డం మామూలు విష‌యం కాదు. ర‌చ‌యిత రామారావు ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా మెగా స్ధాయిలోనే ఈ పుస్త‌కాన్ని తీసుకువ‌చ్చినందుకు ఆయ‌న ధైర్య సాహ‌సాల‌ను అభినందించ‌క త‌ప్ప‌దు.

English summary
Senior journalist Paupuleti Rama Rao has written a book on Chiranjeevi's cine life in the name of 'Mega Chiranjeevitham Cineprastanam' and this book is launched today by Ram Charan. Allu Aravind, V V Vinayak etc also graced the event of this book launch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu