»   » మెగా డాటర్ నిహారిక కామెంట్స్‌పై ఫ్యాన్స్ ఫైర్.. ఇంతకీ ఏమన్నారంటే..

మెగా డాటర్ నిహారిక కామెంట్స్‌పై ఫ్యాన్స్ ఫైర్.. ఇంతకీ ఏమన్నారంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా పరిశ్రమలో వారసులు తప్ప వారసురాళ్లు ఎక్కడ కనిపించరు. అలాంటి ట్రెడిషన్‌కు చెక్ పెట్టి వచ్చిన నటుల కుమార్తెల్లో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక ఒకరు. ఒక మనసు చిత్రం ద్వారా నిహారిక సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఆమె ఎంపిక చేసుకొన్న పాత్రపై మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ పరువు ప్రతిష్టకు మచ్చ తీసుకురావొద్దనే వాదన వినిపించింది.

స్పందించని నిహారిక

స్పందించని నిహారిక

తన తొలి సినిమా గురించి గానీ, ఆ చిత్రంలో తన పాత్ర గురించి గానీ నిహారిక ఎక్కడ స్పందించలేదు. వాస్తవంగా ఒక మనసులో నాగశౌర్యతో కలిసి చేసిన సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయన్న విషయంపై మీడియాలో కూడా దుమారం రేగిన సంగతి తెలిసిందే. తాజా మీడియా సమాచారం ప్రకారం తన తొలి చిత్రంపై చేసిన వాఖ్యలను వారు తప్పుపడుతున్నారు.

రెండో చిత్రం ప్రారంభోత్సవ సందర్భంగా

రెండో చిత్రం ప్రారంభోత్సవ సందర్భంగా

ఒక మనసు చిత్రం తర్వాత నిహారిక నటించబోయే రెండో చిత్రం ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా నిహారిక తొలి చిత్రంపై స్పందించిన తీరు వివాదాస్పదమైంది. ఆమె చేసిన వ్యాఖ్యలను మెగా ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు. ఇంతకీ నిహారిక ఏమన్నదంటే..

ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు

ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు

ఒక మనసు ఫ్లాఫ్ అవుతుందని నాకు ముందే తెలుసు. అయినా కథ నచ్చడంతో చేయాల్సి వచ్చింది. ఆ చిత్ర కథను నేను చాలా ఇష్టపడ్డాను. హీరోయిన్‌‌కు ప్రాధాన్యం ఉండటంతో ముందు వెనుక ఆలోచించకుండా ఒప్పుకొన్నాను. ఆ సినిమా ఫ్లాఫ్ అయినందుకు నాకు ఎలాంటి బాధకలుగలేదు అని నిహారిక చెప్పింది.

మెగా పరువు దిగజార్చొద్దు

మెగా పరువు దిగజార్చొద్దు

నిహారిక చెప్పిన మాటలపై మెగా ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఆడదని ముందే తెలిస్తే ఎందుకు ఒప్పుకొన్నారు? హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు ఎలాంటి కథను ఒప్పుకోవాలో తెలియదా? హద్దు మీరిన సీన్ల నటించకూడదని తెలియదా? అనే వాదనను మెగా ఫ్యాన్ వినిపించినట్టు తెలిసింది. మంచి సినిమాను ఎంచుకొని సక్సెస్ సాధిస్తే మెగా కుటుంబానికి మంచి పేరు వచ్చేది కాదా అనే సూచనను కూడా ఇచ్చారట.

English summary
Mega Fans angry over Actress Niharika comments which made recently. She talks about her first movie Oka manasu on the occassion of Second movie. Niharika told media that she knew that her first movie would be a Flap.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu