»   » ధృవ చూసి వస్తూ... మరణం... ఆనందం విషాదమయ్యింది....

ధృవ చూసి వస్తూ... మరణం... ఆనందం విషాదమయ్యింది....

Posted By:
Subscribe to Filmibeat Telugu

ధృవ సినిమా చూసి వస్తున్న రామ్ చరణ్ అభిమానులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా 12 మంది గాయాలపాలయ్యారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వావిలాలకు చెందిన 14 మంది రామ్‌చరణ్ ఫ్యాన్స్ శుక్రవారం రాత్రి అయిజలో ధృవ సినిమా చూసేందుకు వెళ్లారు. సినిమా చూసిన అనంతరం వారు తిరిగి ఆటోలో బయలుదేరారు. వావిలాలకు చెందిన 14 మంది రామచరణ్ అభిమానులు శుక్రవారం రాత్రి అయిజలో ధృవ సినిమా చూసేందుకు వెళ్లారు. సినిమా చూసిన అనంతరం వారు ఆటోలో ఇంటికి బయల్దేరారు. పందెపురం వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న రాజు, సతీష్ అనే యువకులు చనిపోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Mega fans died, two killed in road accident

English summary
Sad news for mega fans,Mega fans died, two killed in road accident
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu