For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సాయి ధరమ్ తేజ్ కోసం అభిమానుల మొండిపట్టు.. అస్సలు తగ్గట్లేదుగా!

  |

  అభిమానం అనేది ఒక్కసారి పెంచుకుంటే అంత ఈజీగా మనసులో నుంచి వెళ్లిపోదని చెప్పవచ్చు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సక్సెస్ లో ఉన్నా లేకపోయినా కూడా కొంతమంది అభిమానులు ఎప్పటి కూడా వాటిని విడిచి పెట్టాలని అనుకోరు. ముఖ్యంగా మెగా అభిమానులు సంఖ్య రోజు రోజుకు మరింత ఎక్కువవుతుందని చెప్పాలి. ఇక వారికి ఇష్టమైన హీరోకు ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం కంగారు పడిపోతారు. తమ ఇంట్లో వాళ్లకు జరిగింది అని అనుకుంటూ.. వీలైనంత త్వరగా కోలుకోవాలని కూడా వారు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పూజలు చేసి ప్రత్యేకంగా హోమాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం అందరి చూపు కూడా సాయి ధరంతేజ్ పైనే ఉంది. అతను త్వరగా కోలుకోవాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాపై ఒక లుక్కేస్తే ఈజీగా అర్థమవుతొంది.

  కంగారు పడాల్సిన అవసరం లేదు

  కంగారు పడాల్సిన అవసరం లేదు

  ఇటీవల సాయి ధరమ్ తేజ్ హైదరాబాదులో రాయదుర్గం దగ్గర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బైక్ మీద వెళుతూ వెళుతూ యాక్సిడెంట్ కు గురైన ఈ మెగా హీరో మొత్తానికి పెద్ద ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఎప్పటికప్పుడు వైద్యులు సినీ ప్రముఖులు మెగా హీరోలు కూడా సుప్రీం హీరో ఆరోగ్యం పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అభిమానులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని మెగాస్టార్ ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.

   ఎందుకంత ఇష్టం అంటే..

  ఎందుకంత ఇష్టం అంటే..

  సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయిన మొదటి రోజు నుంచి కూడా ఓ వర్గం అభిమానులు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారనే చెప్పాలి. త్వరగా కోలుకోవాలని ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ లో మెగా అభిమానులు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే అతను చాలాసార్లు లేని వాళ్లకు సహాయం కూడా చేశాడు తనను చూడడానికి వచ్చిన అభిమానులకు కొన్నిసార్లు సినిమా సెట్స్ వద్దనే భోజనాలు పెట్టి కూడా పంపించాడు.

   త్వరగా కోలుకోవాలని

  త్వరగా కోలుకోవాలని

  సాయు తన వంతుగా ఎప్పటికప్పుడు మంచి పనులు చేస్తూనే ఉన్నాడు. సంపాదించిన దాంట్లో కొంత లేనివారికి ఉపయోగిస్తే అది తన మనసుకు ఎంతగానో నచ్చుతుందని తను చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ తరహాలోనే అడుగులు వేస్తున్నాడు. అందుకే అభిమానులు అతన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది ఏకంగా దేవాలయాలను చుట్టేస్తున్నారు. కొంతమంది సాయి ధరంతేజ్ కోలుకోవాలని కాలి నడకన తిరుమల మెట్లు ఎక్కడ విశేషం. అలాగే వైజాగ్ లో కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. శ్రీకాకుళం కర్నూలు లో కూడా హోమాలు యాగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  Auto Ramprasad's Peep Show First Look | Poster Launch Press Meet
  సర్జరీ సక్సెస్..

  సర్జరీ సక్సెస్..

  ఇక సాయిధరంతేజ ఆరోగ్యం విషయానికి వస్తే ప్రస్తుతం అతని పరిస్థితి చాలా నిలకడగా ఉందని ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఇక హీరో సాయిధర‌మ్ తేజ్ స‌ర్జ‌రీ స‌క్సెస్‌ అని కూడా తెలిపారు. కాల‌ర్ బోన్‌కు చికిత్స చేసిన వైద్యులు. మ‌రో 24 గంట‌లు తేజ్‌ను అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచుతామని అన్నారు.

  English summary
  Sai Dharam Tej under went Surgery for collar bone injury, Dr. Alok Ranjan & Team released a health bulletin regarding this.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X