»   » ప్రత్యేక హోదా పై స్పందించిన మెగా హీరోలు..... నేను సిద్దం అంటూ వరుణ్ తేజ్

ప్రత్యేక హోదా పై స్పందించిన మెగా హీరోలు..... నేను సిద్దం అంటూ వరుణ్ తేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళనాడు ప్రజల మెరీనా బీచ్ జల్లికట్టు ఉధ్యమం ఏపీ ప్రజలతో హోదా కాంక్ష రేకెత్తించింది. ప్రత్యేకహోదాకోసం నెమ్మదిగా ఒక్కొక్కరు కదులుతున్నారు. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ ఎంపీ కేవీపీలు జల్లికట్టు ఉద్యమ స్పూర్తితో ప్రత్యేకహోదా ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించగా. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా హోదాకోసం ఎవరు వచ్చినా పోరాడేందుకు సముఖత వ్యక్తం చేస్తోంది.

చెన్నై మెరీనా బీచ్ లో యువ'తరంగం' ఉవ్వెత్తున ఎగసిపడడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఆగమేఘాల మీద జల్లికట్టు ఆర్డినెన్స్‌ కు కేంద్ర సర్కారు పచ్చజెండా ఊపింది. తమ సంప్రదాయ క్రీడపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని సముద్రతీరంలో తమిళ యువత సాగించిన పోరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించింది.

Mega Hero Varu Tej on AP special sTatus

జల్లికట్టుపై కట్టుబాట్లను తెంచేందుకు పాలకులు అంగీకరించినా విద్యార్థులు వెనక్కు తగ్గలేదు. ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసే దాకా ఉద్యమం ఆపేదిలేదంటూ మెరీనా బీచ్ వదిలేందుకు యువత విముఖత వ్యక్తం చేసింది. 'మన రాష్ట్రం- మన హోదా' అంటూ మహోద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

ప్రత్యేకహోదా కోసం ఈ నెల 26న విశాఖ బీచ్‌లో ఉద్యమానికి ఆంధ్ర యువత సిద్ధమవగా, ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తూ టాలీవుడ్‌ హీరో, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌తో పాటు వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ కూడా తమ మద్దతును తెలిపారు. హీరో సాయి ధ్రం తేజ్ తన ఫేస్బుక్ వాల్ మీద "నా రాష్ట్రానికీ, ప్రజలకీ మంచి జరిగేది ఏదైనా దానికి మద్దతివ్వాల్సిందే... నేను ఏపీ ప్రత్యేక హోదా (పోరాటానికి) మద్దతు ఇస్తున్నా" అంటూ పోస్ట్ చేసాడు.

Mega Hero Varu Tej on AP special sTatus

ఇంతే కాదు ఏపీ ప్రత్యేక హోదాకోసం యువహీరోలంతా కదులుతున్నారు. మెగా ఫ్యామిలీ లో నుంచి పవన్, చిరు, వరుణ్ తేజ్ లు స్పందించినా ఇప్పటివరకూ నందమూరి హీరోలనుంచి మాత్రం ఈ 26 నిరసన కార్యక్రమం గురించి ఏ ప్రకటనా రాకపోవటం పై కొన్ని ఫేస్బుక్ కామెంట్లు మాత్రం వినిపిస్తున్నాయి.

Mega Hero Varu Tej on AP special sTatus

ఇదిమనమంతా ఏకమవ్వాల్సిన సమయం అంటూ... ఒకప్పటి బాలనటుడూ..ఇప్పటి హీరో రేపటి కృష్ణవంశీ నక్షత్రం లో కనిపించబోయే స్టైలిష్ విలన్ తనీష్ పోస్ట్ చేస్తే. మరో యువహీరో సందీప్ కిషన్ ఈ 26 న జరగబోయే శాంతి నిరసన కి రండి అంటూ పోస్ట్ చేసాడు. కలిసి కట్టు గాపోరాడే ప్రజలతో సినీ హీరోలు కలిస్తే హైప్ వస్తుందన్న విషయమూ ఇప్పుడిప్పుడే మనోళ్ళకూ ఎక్కుతోంది. వరదలూ, భూకంపాలకూ మాత్రమే కలిసి వచ్చే మన తారలు ఇప్పుడు మిగతా విషయాల మీద కూడా కాస్త దృష్టి పెడుతున్నారు...

English summary
"Will be supporting anything that is for the welfare of the people of our states!I Support the Special Status of AP!" Mega hero Varun tej poasted on Facebook page
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu