»   » హీరోయిన్లందరికీ మెగా హీరో వార్నింగ్, ఫిదా మొదట్లో ముసురు అట: ఫిదా విశేషాలు మరికొన్ని

హీరోయిన్లందరికీ మెగా హీరో వార్నింగ్, ఫిదా మొదట్లో ముసురు అట: ఫిదా విశేషాలు మరికొన్ని

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈమధ్య కాలం లో అన్నీ సాఫ్ట్ కథలూ, లేదంటే ప్రేమకథలు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపుతున్నాయి. భారీ బడ్జెట్ ఉంటేనే పెద్ద హిట్ అన్న స్థాయిలో ఒక జానర్ వెళ్తూంటే చీన చిన్న మెరుపులే అనుకున్న మామూలు రేంజి సినిమాలు కూడా ఇప్పుడు బాక్సాఫీస్ ని ఆదుకుంటున్నాయి. పోయిన వారం నిన్ను కోరి అంటూ నానీ కుమ్మేసుకుంటే ఈవారం "ఫిదా" జనాన్ని కట్టిపడేస్తోంది... అయితే ఈ కథ వెనుక కూడా చిన్న కథ ఉంది...

దిల్‌ రాజుకు నచ్చలేదు

దిల్‌ రాజుకు నచ్చలేదు

శేఖర్‌ కమ్ముల రాసుకున్న ఈ కథకు తగ్గట్టు ముందుగా ‘ముసురు' అని టైటిల్‌ పెడదామనుకున్నారట. ఆ టైటిల్‌నే దిల్‌ రాజుకు చెప్పాడట శేఖర్‌. అయితే ఆ టైటిల్‌ దిల్‌ రాజుకు నచ్చలేదట. ఆ పదాన్ని ఎవరూ పెద్దగా ఉపయోగించరని, టైటిల్‌ కొంచెం నెగిటివ్‌గా ఉందని భావించారట దిల్‌ రాజు. వేరే టైటిల్‌ గురించి ఆలోచించి చివరకు ‘ఫిదా' అనే టైటిల్‌ను ఖరారు చేశారట.


Dil Raju Wantedly created A Scene In Fidaa Movie
తెలంగాణ యాసలో సాయి పల్లవి

తెలంగాణ యాసలో సాయి పల్లవి

అంచనాలకు మించి ప్రేక్షకులను ‘ఫిదా' చేస్తోంది. ఇక హీరోయిన్ సాయి పల్లవి తెలుగులో తొలి సినిమాతోనే ఘన విజయం అందుకుంది. తెలంగాణ యాసలో సాయి పల్లవి డైలాగులు చెప్పిన విధానం, ఆమె నటన ఎంతగానో ఆకట్టుకున్నాయి. తొలిరోజే ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన రావడంతో చిత్ర యూనిట్ సంతోషంలో మునిగితేలుతోంది.


మీడియాతో చిట్‌చాట్

మీడియాతో చిట్‌చాట్

ఈ సందర్భంగా సాయి పల్లవి, వరుణ్‌తేజ్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. సాయి పల్లవి పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ‘తనకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన శేఖర్ కమ్ములకు పెద్ద థ్యాంక్స్ చెప్పాలి' అంది. వరణ్ తేజ్ మాట్లాడుతూ.. బయట తన స్నేహితులంతా తన కంటే పల్లవి గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని, అది తనకూ సంతోషంగా ఉందని చెప్పాడు.


వరుణ్ తేజ్ లో ఉన్న గొప్ప గుణమే

వరుణ్ తేజ్ లో ఉన్న గొప్ప గుణమే

నిజానికి ఇంత స్పోర్టివ్ గా తీసుకోవటం వరుణ్ తేజ్ లో ఉన్న గొప్ప గుణమే. బయట కూడా వరుణ్ కంటే సాయి పల్లవి కే ఎక్కువ పేరు వచ్చింది. దాన్ని చాలా సింపుల్ గా తీసుకోవటమే కాదు. టాలీవుడ్ హీరోయిన్లకు పల్లవి తరపున ఒక వార్నింగ్ కూడా ఇచ్చేసాడు. ఇప్పటికే తన టాలెంట్ తో ఉన్న అవకాశాలన్నీ ఎగరేసుకుపోయే చాన్స్ ఉందీ అంటూ వచ్చిన టాక్ ని మళ్ళీ ఒకసారి తానే చెప్పాడు.


ఆమెకు బిగ్ కంగ్రాట్స్

ఆమెకు బిగ్ కంగ్రాట్స్

‘‘సినిమా ఫస్ట్ షెడ్యూల్ చేస్తున్నప్పటినుంచే నాకు తెలుసు పల్లవి ఈ సినిమాలో ఇరగదీస్తుందని. ఆమె క్యారెక్టర్‌కు, ఆమె చెప్పిన డైలాగులకు నేననుకున్న దానికంటే బయట ఎక్కువ రెస్పాన్స్ ఉంది. ఆమెకు బిగ్ కంగ్రాట్స్. నేను చాలా మందికి చెప్పాను.. ఇండస్ట్రీలోకి పల్లవి వస్తోంది.. మిగతా హీరోయిన్లందరూ జాగ్రత్తగా ఉండండని.


అందరూ జాగ్రత్తగా ఉండండి

అందరూ జాగ్రత్తగా ఉండండి

అది మాత్రం నిజం అవుతుంది. హీరోయిన్లందరూ ఇప్పుడు జాగ్రత్తగా ఉంటారు. హీరోయిన్లందరికీ ఇప్పుడు ఇంకోసారి చెబుతున్నా.. అందరూ జాగ్రత్తగా ఉండండి.'' అని వరుణ్ తేజ్ హెచ్చరించాడు. నిజానికి వరుణ్ మాటల్లో ఏమాత్ర అతిశయోక్తి లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం కూడా. ఇప్పటికిప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ సాయి పల్లవినే...English summary
Mega hero Varun Tej is Damn Happy with his Latest hit Fida. in a Chit Chat He issued a Funny warning To tollywood heroines
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu